Forbes Billionaire List 2018 Has Declared Mukesh Ambani As T .. Read more at: https://www.latestly.com/india/information/mukesh-ambani-indias-richest-man-turns-61-here-is-the-billionaires-net-worth-and-family-details-119430.html

Mumabi, June 19: రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత, ఆసియా కుబేరుడు ముకేశ్ అంబానీ (Mukesh Ambani) అనుకున్నది సాధించాడు. వరుస పెట్టుబడుల సునామీతో రిలయన్స్ ను అప్పులు లేని సంస్థగా (Reliance Net Debt-Free) మార్చివేశాడు. కాగా 2021 మార్చి నాటికి ఆర్ఐఎల్ (Reliance) సంస్థను రుణ రహిత సంస్థగా తీర్చిదిద్దుతానన్న వాగ్దానాన్ని ముందే నెరవేర్చామని ఛైర్మన్ ముకేశ్ అంబానీ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. జియో నుంచి మరో సంచలన ఆఫర్, ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితం, జియో ఫైబర్ గోల్డ్, ఆపైన ప్లాన్ లో ఉన్నవారికి మాత్రమే

అనుకున్న లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందుగానే సాధించాం. "రిలయన్స్ ఇపుడు బంగారు దశాబ్దంలో" (Reliance In Golden Decade) ఉందని బిలియనీర్ అంబానీ ప్రకటించారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 58 రోజుల్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,68,818 కోట్లు సేకరించింది.

2021 మార్చి 31 నాటికి రిలయన్స్‌ను అప్పులు లేని కంపెనీగా (Reliance Industries now 'debt-free') మారుస్తామని వాటాదారులకు ఇచ్చిన వాగ్దానాన్ని చాలా ముందుగానే నేరవేర్చామని ప్రకటించేందుకు చాలా ఆనందంగా ఉందని అంబానీ తెలిపారు. వాటాదారుల అంచనాలను మళ్లీ మళ్లీ అధిగమించిడం రిలయన్స్ డీఎన్ఏలోనే ఉందని జియో అధినేత పేర్కొన్నారు. అలాగే రిలయన్స్ వ్యవస్థాపకులు, తన తండ్రి ధీరూబాయి అంబానీ ఆశయాల సాధన, దేశ శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధిలో మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించడమే కాదు.. వాటిని సాధిస్తామంటూ అంబానీ భరోసా ఇచ్చారు. జియోలోకి భారీగా పెట్టుబడులు, నెరవేరుతున్న ముకేష్ అంబానీ లక్ష్యం, 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్

ఏప్రిల్ 22 నుంచి తొమ్మిది వారాల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాల విక్రయం ద్వారా రిలయన్స్ 115,693.95 కోట్ల రూపాయలు సేకరించింది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడం మరో విశేషం. దీని ద్వారా 53,124.20 కోట్ల రూపాయలను సాధించింది. కేవలం 58 రోజుల్లో 168,818 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకోవడంతో రిలయన్స్ నిర్దేశిత లక్ష్యం నెరవేరింది. మార్చి 31, 2020 నాటికి గ్రూప్ నికర అప్పు 1,61,035 కోట్ల రూపాయలుగా ఉంది. 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా అవతరించనున్నామని గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు శుక్రవారం నాటి మార్కెట్ లో రిలయన్స్ షేరు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో 1,684 రూపాయల వద్ద రికార్డ్ గరిష్టానికి చేరింది.

ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పటికే జియోలో భారీ పెట్టుబడులు పెట్టగా తాజాగా, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) రూ. 11,367 కోట్లతో 2.32 శాతం షేర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జియోలో తొమ్మిది వారాల్లో ఇది 11వ పెట్టుబడి కావడం గమనార్హం. ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ (రెండు ఇన్వెస్టిమెంట్లు) విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కేటర్టన్, పీఐఎఫ్ పెట్టుబడుల ద్వారా జియో ఇప్పటి వరకు రూ. 1.15 లక్షల కోట్లను సమీకరించింది. మొత్తంగా రూ. 1,15,693.95 కోట్లు జియో సమీకరించింది. ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకున్న కంపెనీ ప్రపంచంలో మరేదీ లేకపోవడం గమనార్హం. పీఐఎఫ్ తాజా పెట్టుబడితో జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు పెరగ్గా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు పెరిగినట్టు జియో తెలిపింది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే దేశీయంగా 5జీ ట్రయల్స్‌ నిర్వహించేందుకు రిలయన్స్‌ జియో కసరత్తు చేస్తున్నది. టెలికం శాఖ (డీవోటీ) అనుమతి కోసం ఆ సంస్థ ఎదురు చూస్తున్నది. 5జీ ట్రయల్స్‌ కోసం జియో చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలో నిర్ణయం తీసుకొంటామని డీవోటీ వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి పరిమితమయ్యే ల్యాబ్‌ ట్రయల్స్‌కు 5జీ తరంగాలు అవసరంలేదని, అయినప్పటికీ ఈ ట్రయల్స్‌ కోసం డీవోటీ అనుమతి కోరామని జియో తెలిపింది. 5జీ ట్రయల్స్‌ కోసం జియోతోపాటు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా టెలికం శాఖను సంప్రదించినప్పటికీ ఇంకా ఏ సంస్థకూ అనుమతి ఇవ్వలేదు. టెలికం సంస్థలతోపాటు నోకియా, జెడ్‌టీఈ, శాంసంగ్‌, ఎరిక్‌సన్‌, హువావీ లాంటి నెట్‌వర్క్‌ పరికరాల తయారీ సంస్థలు కూడా దేశంలో 5జీ ట్రయల్స్‌ కోసం దరఖాస్తు చేసుకొన్నాయి.