JioBharat J1 4G: భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి
4జీ కనెక్టివిటీతో వచ్చిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ ను ఇది అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది.
దేశీయ మార్కెట్లో రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్ జియో భారత్ జే1 4జీ (JioBharat J1 4G) ఫోన్ ఆవిష్కరించింది. 4జీ కనెక్టివిటీతో వచ్చిన ఎంట్రీ లెవల్ ఫీచర్ ఫోన్ ఇది అని పేర్కొంది. జియో భారత్ ప్లాన్ కు మద్దతుగా బడ్జెట్ ఆఫర్ ఫోన్ ను ఇది అందిస్తోంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి యాప్స్ ప్రీ-ఇన్ స్టల్ చేసింది. రేర్ కెమెరా యూనిట్ తో మార్కెట్ లో అందుబాటులో ఉంది. గతేడాది అక్టోబర్‌లో ఆవిష్కరించిన జియో భారత్ బీ1 4జీ ఫోన్‌తో జత కలుస్తుంది.
డార్క్ గ్రే కలర్ ఆప్షన్‌లో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్ అమెజాన్ ద్వారా రూ.1,799లకు లభిస్తుంది. జియోభారత్ జే1 4జీ ఫోన్ డెడికేటెడ్ నేవిగేషన్ ప్లస్ ఫిజికల్ కీప్యాడ్‌తోపాటు 2.8 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. ఈ ఫోన్ థ్రెడ్ఎక్స్ ఆర్టీఓఎస్ (Threadx RTOS) వర్షన్ పై పని చేస్తుంది. 0.13 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీ కెపాసిటీతో వస్తున్న ఈ ఫోన్ లో స్టోరేజీ కెపాసిటీని 128 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగుస్తోంది, ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
నెలవారీగా 14జీబీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించే రూ.123.. 4జీ రీచార్జి ప్లాన్ అందిస్తుంది. ముందస్తుగా ఇన్‌స్టాల్ చేసిన జియో టీవీ యాప్ ద్వారా పలు రీజనల్ చానెళ్లతో కలిసి 455+ చానెళ్లు పొందొచ్చు. యూపీఐ లావాదేవీలు తేలిగ్గా జరిపేందుకు జియో పే యాప్ కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ 2500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. 3.5 ఎంఎం ఆడియో జాక్, రేర్ లో డిజిటల్ కెమెరా యూనిట్, ఆన్ లైన్ పేమెంట్స్ కోసం యూజర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి కెమెరా ఉపకరిస్తుంది.