Mumbai, July 28: అడిటింగ్ అవసరం లేని వ్యక్తిగత ఆదాయం (Income Tax) పన్ను చెల్లింపుదారులు జూలై 31లోగా గత ఆర్థిక సంవత్సరం 2023-24 (అంచనా సంవత్సరం 2024-25)లో ఐటీఆర్ ఫైల్ (ITR Filing) చేయాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సిందే. గడువు దాటాక దాఖలు చేసే ఐటీఆర్ ను బీ లేటెడ్ ఐటీఆర్ (Belated ITR) అని అంటారు. ఆదాయం పన్ను చట్టం-1961లోని 234ఎఫ్ సెక్షన్ ప్రకారం బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ చేస్తే రూ.5000 వరకూ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల్లోపు ఆదాయం కల వారు, బుల్లి టాక్స్ పేయర్లపై బీలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.1000లకు పెనాల్టీని పరిమితం చేశారు. జీరో టాక్స్ పేయబుల్ అయినా గడువు దాటితే మాత్రం బీలేటెడ్ ఐటీఆర్ అవుతుందని ఇంట్లో తేల్చి చెప్పేశారు. బీ లేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసిన వారు ఐటీఆర్ తోపాటు లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించినట్లు చలాన్ చూపితేనే కన్ఫర్మేషన్ ఇస్తారు.
బీలేటెడ్ ఐటీఆర్ ఫైలింగ్ (Belated ITR Filing) చేయడం వల్ల కొన్ని బెనిఫిట్లు కోల్పోతారు పన్ను చెల్లింపుదారులు. దీర్ఘకాలిక పెట్టుబడులు, బిజినెస్ ఇన్ కం, ఇతర మార్గాలో సమకూర్చుకునే నిధులపై నష్టాన్ని తర్వాతీ ఏడాదికి కొనసాగించలేరు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయం పన్ను విధానాన్ని ఎంచుకునేందుకు అనుమతించరు.
ఆదాయం పన్ను చట్టంలోని 139 (1) సెక్షన్లోని సెవెన్త్ ప్రొవిజన్ ప్రకారం ఐటీఆర్ ఫైలింగ్ కోసం తప్పనిసరి షరతులు
– ఒకే లావాదేవీలో గానీ, సగటున గానీ రూ2. లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసినా (విదేశీ ప్రయాణం చేసినా)
– రూ.లక్ష, అంతకంటే కంటే సింగిల్ ట్రాన్సాక్షన్ లో పే చేసినా
– ఒకటి, అంతకంటే ఎక్కువ కరంట్ ఖాతాల్లో రూ.కోటి డిపాజిట్ చేసినా..
– ఇతర ప్రిస్క్రైబ్డ్ కండిషన్లు