JioPhone Next: అత్యంత చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ 'జియోఫోన్ నెక్ట్స్' ను ప్రకటించిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ; దీని ధర ఎంత ఉండొచ్చు మరియు ఫీచర్లు ఎలా ఉంటాయో ఇక్కడ చూడండి

ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC చేత పనిచేస్తుంది....

JioPhone Next (Photo Credits: Google)

Mumbai, June 25:  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గురువారం RIL కంపెనీ 44వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో మరియు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన పవర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

జియోఫోన్ నెక్ట్స్ వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10 నుండి భారత మార్కెట్లో అందుబాటులో ఉంటుందని మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ అవుతుంది అని అంబానీ అన్నారు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ లో వాయిస్ అసిస్టెంట్ మరియు భాషా అనువాదంతో సహా ఎన్నో అత్యాధునిక ఫీచర్స్ ఉంటాయని వెల్లడించారు.

అయితే, జియోఫోన్ నెక్ట్స్ ధరను అంబానీ ప్రకటించనప్పటికీ, ఈ హ్యాండ్‌సెట్ ధర రూ. 5 వేల లోపు ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. ఇందులో స్మార్ట్ కెమెరాతో ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) ఫిల్టర్లు, వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్ట్స్ యొక్క ఆటోమేటిక్ రీడింగ్, భాషా అనువాదం లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 480 SoC చేత పనిచేస్తుంది. మరియు 2,000mAh బ్యాటరీ, ఫ్రంట్ కెమెరా, మంచి ర్యామ్ మరియు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అన్నింటికీ మించి ఈ స్మార్ట్‌ఫోన్ కోసం గూగుల్ ప్రత్యేకంగా రూపొందించిన అనుకూల అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది.