Meta Launches Paid Blue Badge: ఫేస్‌బుక్‌ బ్లూ ట్రిక్ అంటే ఏమిటీ, డబ్బులు ఎంత చెల్లించాలి, దాని వల్ల యూజర్ కు ఊపయోగం ఏమిటి ?, ఇన్‌స్టా,ఫేస్‌బుక్ యూజర్లకు షాకిచ్చిన జుకర్‌ బర్గ్‌

ఇన్ని రోజులు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్ని (Facebook, Instagram) ఉచితంగా అందించిన జుకర్‌ బర్గ్‌.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Mark Zuckerberg, CEO, Facebook

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ బాటలో మెటా (facebook) సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ అడుగులు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఫేస్‌బుక్‌, ఇన్‌ స్టాగ్రామ్‌ సేవల్ని (Facebook, Instagram) ఉచితంగా అందించిన జుకర్‌ బర్గ్‌.. ఇప్పుడు యూజర్ల నుంచి ప్రతినెలా ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్ల ధ్రువీకరణ కోసం సబ్‌స్క్రిప్షన్ సేవలను (Meta Launches Paid Blue Badge) ప్రారంభించబోతున్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ ఆదివారం ప్రకటించారు. త్వరలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సర్వీసును ప్రవేశపెడతామన్నారు. మార్క్ ప్రకటన ప్రకారం.. ఈ సర్వీసు కోసం నెలనెలా వెబ్ యూజర్లు 11.99 డాలర్లు చెల్లించాలి. ఐఓఎస్ యూజర్ల నెలవారీ బిల్లు 14.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగులను సాగనంపుతున్న గూగుల్.. భారత్ లో 453 మంది ఇంటికి

ఈ సర్వీసుతో యూజర్లు తమ అకౌంట్లను ప్రభుత్వం కేటాయించిన గుర్తింపు కార్డులతో మెటా ధ్రువీకరణ(వెరిఫికేషన్) పొందచ్చు. వెరిఫికేషన్ పూర్తయిన అకౌంట్లకు ‘బ్లూ బ్యాడ్జ్’ కేటాయిస్తారు. అంతేకాకుండా.. సబ్‌స్క్రిప్షన్ ఉన్న అకౌంట్లకు నకిలీల బెడద లేకుండా ఫేస్‌బుక్ అదనపు భద్రత కల్పిస్తుంది. నేరుగా కస్టమర్ కేర్‌తో సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది.

ఆగని ఉద్యోగాల కోతలు, 700 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన టెక్ దిగ్గజం డాక్యుసైన్, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ సబ్‌స్క్రిప్షన్ సేవలను ప్రారంభించబోతున్నట్టు మార్క్ తెలిపారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో బ్లూ టిక్‌ యూజర్ల నుంచి పెద్ద మొత్తంలో యూజర్ల ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ పేరిట ట్విట్టర్ యూజర్ల నుండి డబ్బులు వసూలు చేస్తోంది.