Microsoft Layoffs: ఆగని లేఆప్స్, 276 మంది ఉద్యోగులను తీసేస్తున్న మైక్రోసాఫ్ట్, ముందు ముందు ఇంకా కోతలుంటాయని ప్రకటన

ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక టాప్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది.

Microsoft (Photo Credit- Wikimedia Commons)

అమెజాన్, గూగుల్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా ప్రముఖ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. ఇంకా విడతల వారీగా తమ ఉద్యోగులకు లేఆఫ్స్ (Layoffs) ప్రకటిస్తూనే ఉన్నాయి. ఇక టాప్ టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైంది. తాజా లేఆప్స్ లో వాషింగ్టన్ (Washington) కార్యాలయంలోని ఉద్యోగుల్లో 276 మంది ఇప్పటికే లేఆఫ్స్ కు ప్రభావితులయ్యారు.

వీడియో ఇదిగో, తొలి ఏఐ యాంకర్‌ లీసా వచ్చేసింది, అవలీలగా వార్తలు చదివేస్తున్న మిషన్ లేడీ

అందులో 66 మంది వర్చువల్ గా పనిచేస్తున్నవారు ఉన్నారని సంస్థ తెలిపింది.ఈ ఏడాది ప్రారంభంలోనే 10 వేల మంది ఉద్యోగుల‌ను (employees) తొల‌గిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. అయితే, రానున్న రోజుల్లో గతంలో ప్రకటించిన దానికంటే అదనంగా కోతలు ఉంటాయని తాజాగా వెల్లడించింది.