Moto G04s: 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మోటో జీ04ఎస్ వచ్చేసింది, ధర కేవలం రూ.6,999 మాత్రమే, ఫీచర్లు ఇతర వివరాలపై ఓ లుక్కేసుకోండి

గత ఫిబ్రవరిలో వచ్చిన మోటో జీ 04 ఫోన్ కొనసాగింపుగా మోటో జీ 04ఎస్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. 15వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది.

Moto_g04s (Photo-Moto)

మోటరోలా తన మోటో జీ 04ఎస్ (Moto G 04s) ఫోన్‌ను భారత్ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. గత ఫిబ్రవరిలో వచ్చిన మోటో జీ 04 ఫోన్ కొనసాగింపుగా మోటో జీ 04ఎస్ ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. 15వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. సింగిల్ ర్యామ్ అండ్ స్టోరేజీ ఫీచర్లతో వస్తున్న మోటో జీ 04ఎస్ ఫోన్ 50-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్, మోటరోలా ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో లభిస్తుందీ

మోటో జీ 04ఎస్ (Moto G04s) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999లకే లభిస్తుంది. కాంకార్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్ రైజ్ ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. కార్నింగ్ గ్లాస్ 3 ప్రొటెక్షన్, 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.56 అంగుళాల హెచ్డీ+ (1612×720 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్‌సీడీ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తుంది. 4జీబీ ర్యామ్ కెపాసిటీని వర్చువల్‌గా 8 జీబీ వరకూ, మైక్రో ఎస్డీ కార్డు సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. రూ. 10 వేలకే 50-మెగా పిక్సెల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్, లావా యువ 5జీ పీచర్లు, ధర, ఇతర వివరాలు మీకోసం

మోటో జీ04ఎస్ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 15వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5 ఎంఎం ఆడియో జాక్ ఉంటాయి. వై-ఫై, జీపీఎస్ బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఐపీ52 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉంటుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif