ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా అందుబాటు ధరలో కొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. యువతరాన్ని దృష్టిలో ఉంచుకొని యువ 5జీ (Lava Yuva 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.10 వేలుగా కంపెనీ నిర్ణయించింది. 4జీబీ + 64జీబీ స్టోరేజ్ ధర రూ.9,499. 4జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. అమెజాన్‌తో పాటు లావా ఇ-స్టోర్, రిటైల్ ఔట్‌లెట్లలో ఈ ఫోన్ జూన్ 5 నుంచి విక్రయానికి రానుంది. అదిరే ఫీచర్లతో రియల్ మీ జీటీ 6టీ 5జీ ఫోన్ వచ్చేసింది, ఆ కార్డు ఉన్నవారికి రూ. 4 వేలు డిస్కౌంట్, పూర్తి వివరాలు ఇవిగో..
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ కెమెరా సెటప్, మ్యాట్టె ఫినిష్ తో గ్లాస్ బాక్, సర్క్యులర్ షేప్డ్ కమెరా మాడ్యూల్, హోల్ పంచ్ డిస్ ప్లే డిజైన్, ఫ్లాట్ ఫ్రేమ్ విత్ రౌండెడ్ కార్నర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్. గరిష్టంగా 2.4 గిగా హెర్ట్జ్ స్పీడ్‌తో ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ విత్ టూ కోర్స్, 2.0 గిగా హెర్ట్జ్ క్లాకింగ్ 6 కోర్స్ కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ లేదా మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 16-మెగా పిక్సెల్ సెన్సర్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంది.