Telecom War: ప్రపంచ ఆరవ కుబేరుడు ముకేష్ అంబానీ, కొత్త వినియోగదారులతో దూసుకుపోతున్న రిలయన్స్ జియో, బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్

భారత టెలికాం మార్కెట్లో జియో (Reliance Jio) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కొత్త వినియోగదారులను చేర్చుకుంటూ ప్రత్యర్థులకు అందనంతగా ఎత్తులో దూసుకుపోతోంది. మార్చి నెలలో కొత్తగా 4.68 మిలియన్ల మొబైల్ యూజర్లు జియోను ఎంచుకున్నారు. ఫలితంగా జియో మొత్తం యూజర్ల బేస్ 387 మిలియన్లు దాటిపోయినట్టు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను బట్టి తెలుస్తోంది. మార్చి నెలలో ఢిల్లీలో కొత్తగా 2.59 లక్షల మంది జియో ఖాతాదారులుగా మారారు.

Forbes Billionaire List 2018 Has Declared Mukesh Ambani As T .. Read more at: https://www.latestly.com/india/information/mukesh-ambani-indias-richest-man-turns-61-here-is-the-billionaires-net-worth-and-family-details-119430.html

Mumbai, July 15: భారత టెలికాం మార్కెట్లో జియో (Reliance Jio) తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. కొత్త వినియోగదారులను చేర్చుకుంటూ ప్రత్యర్థులకు అందనంతగా ఎత్తులో దూసుకుపోతోంది. మార్చి నెలలో కొత్తగా 4.68 మిలియన్ల మొబైల్ యూజర్లు జియోను ఎంచుకున్నారు. ఫలితంగా జియో మొత్తం యూజర్ల బేస్ 387 మిలియన్లు దాటిపోయినట్టు టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ ట్రాయ్ (TRAI) గణాంకాలను బట్టి తెలుస్తోంది. మార్చి నెలలో ఢిల్లీలో కొత్తగా 2.59 లక్షల మంది జియో ఖాతాదారులుగా మారారు. జియో నుంచి సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు, జియో నుండి ఇతర నెట్‌వర్క్‌లకు 12000 నిమిషాల టాక్ టైం, కొత్త ప్లాన్ల వివరాలు ఇవే

అదే సమయంలో భారతీ ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియాలు (Vodafone Idea) వినియోగదారులను కోల్పోయాయి. ఎయిర్‌టెల్ 1.2 మిలియన్ల మంది ఖాతాదారులను కోల్పోగా, వొడాఫోన్ ఏకంగా 6.3 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. రిలయన్స్ జియో 33.4 శాతం మార్కెట్ షేర్‌ను సొంతం చేసుకుని అగ్రస్థానంలో నిలవగా, భారతీయ ఎయిర్‌టెల్ 28.31 శాతం, వొడాఫోన్ ఐడియా 27.57 శాతంతో రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

ముకేశ్‌‌ అంబానీ సంప‌ద‌లో మ‌రో రికార్డు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత‌ ముకేశ్‌‌ అంబానీ (Mukesh Ambani) సంప‌ద‌లో మ‌రో రికార్డు సృష్టించాడు. ప్ర‌పంచ కుబేరుల జాబితాలో సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌, ఆల్ఫాబెట్‌ సహ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌‌, లారీపేజ్‌ల‌ను కూడా వెనక్కినెట్టి త‌న స్థానాన్ని మరింతగా మెరుగుప‌ర్చుకున్నాడు. దీంతో ముకేశ్ అంబానీ ప్రపంచంలో ఆరో సంపన్న వ్యక్తిగా‌ అవతరించారు. కాగా, ముకేశ్ అంబానీ గత వారమే ప్ర‌పంచ కుబేరుల జాబితాలో ప్రముఖ పెట్టుబడిదారు వారెన్‌ బఫెట్‌ను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం అంబానీ సంపద 72.4 బిలియన్‌ డాలర్లకు చేరడంతో ఎలాన్ మ‌స్క్‌, లారాపేజ్‌, సెర్గీ బ్రిన్‌ల‌ను దాటి ఆరో స్థానం సొంతం చేసుకున్నార‌ని బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్స్ ఇండెక్స్ వెల్ల‌డించింది.

మార్చి నుంచి ఇప్పటివరకు రిల‌య‌న్స్‌ సంస్థ షేర్ల విలువ రెట్టింపునకు పైగా పెరిగింది. గత శుక్రవారం రిలయన్స్‌ మార్కెట్‌ విలువ కూడా రూ.12 లక్షల కోట్లను దాటేసింది. భారత్‌లో కొవిడ్‌ ప్రభావం మొదలైన తొలి రోజుల్లో రిలయన్స్‌ షేర్ల విలువ బాగా తగ్గింది. ఒక దశలో రూ.1000 లోపునకు వచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి నిదానంగా పుంజుకొన్నాయి. ఫేస్‌బుక్‌తో డీల్‌ తర్వాత వేగంగా విలువను పెంచుకున్నాయి. మార్చి నుంచి ఇప్పటివరకు షేర్ వాల్యూ 120 శాతం పెరిగింది. దీనికి తోడు మార్చి 2021 నాటికి రుణరహిత సంస్థగా అవతరించ‌నున్న‌ట్లు రిల‌య‌న్స్ ప్రకటించడం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపి షేర్ విలువ పెరుగ‌డానికి కార‌ణ‌మైంది.

ఎయిర్‌టెల్ నుంచి బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్

భారతి ఎయిర్‌టెల్ యుఎస్ టెలికాం దిగ్గజం వెరిజోన్‌తో కలిసి వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎయిర్‌టెల్ బ్లూజీన్స్’ ను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది. "ఎయిర్‌టెల్ బ్లూజీన్స్ ఒక సురక్షితమైన, సురక్షితమైన వేదిక, వినియోగదారు గోప్యతను కాపాడాటానికి మేము కట్టుబడి ఉన్నాము" అని భారతి ఎయిర్‌టెల్, భారతదేశం దక్షిణ ఆసియా, సీఈఓ గోపాల్ విట్టల్ ఒక సమావేశంలో అన్నారు. ఈ ప్లాట్‌ఫాం 50,000 మంది హాజరయ్యే అవకాశం కలిగి ఉంటుంది, ఇది ఉపయోగించడానికి సులభమైనది స్పష్టమై,నది అని విట్టల్ చెప్పారు. సమర్పణ కోసం "మొదటి పోర్ట్ ఆఫ్ కాల్" ఎంటర్ప్రైజ్, విట్టల్ చెప్పారు.అయితే కంపెనీ చిన్న కార్యాలయానికి ప్యాకేజింగ్ చేయడాన్ని కూడా చూస్తుందని అన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now