24 Lakh Twitter Handles Blocked: గత రెండు నెలల్లో పెద్ద ఎత్తున ట్విట్టర్ ఖాతాలు బ్లాక్, ఏకంగా 25 లక్షలకు పైగా అకౌంట్లు బ్లాక్ చేసిన ఎక్స్
గత జూన్, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 మంది ఖాతాలను బ్లాక్ చేసినట్లు తాజాగా వెల్లడించింది. బ్లాక్ చేసిన వాటిలో చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించినవి, అశ్లీలతను ప్రోత్సహించే ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి.
New Delhi, AUG 13: నిబంధనలను ఉల్లంఘించిన వినియోగదారులపై ఎక్స్ (Twitter) కఠిన చర్యలు తీసుకుంటోంది. గత జూన్, జూలై నెలల్లో రికార్డు స్థాయిలో 23,95,495 మంది ఖాతాలను బ్లాక్ (Twitter Handles Blocked) చేసినట్లు తాజాగా వెల్లడించింది. బ్లాక్ చేసిన వాటిలో చిన్నారులపై లైంగిక దోపిడీకి సంబంధించినవి, అశ్లీలతను ప్రోత్సహించే ఖాతాలే ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు కూడా మే 26 నుంచి జూన్ 25 మధ్య నెల రోజుల వ్యవధిలో 5,44,473 హ్యాండిళ్లను ఎక్స్ బ్లాక్ చేసింది. తాము ఇప్పటివరకు బ్లాక్ చేసిన ఖాతాల్లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నవి 1,772 ఉన్నాయని వెల్లడించింది.
కేంద్ర సర్కారు తీసుకొచ్చిన నూతన ఐటీ చట్టాలకు (IT ACT) అనుగుణంగా ఎక్స్ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వినియోగదారులపై తీసుకున్న చర్యలు, వినియోగదారుల ఫిర్యాదులకు తాము చూపించిన పరిష్కారాలను వివరిస్తూ ఎక్స్ ప్రతి నెలా నివేదికలను విడుదల చేస్తున్నది.