Netflix India: ఉచితం..ఉచితం, రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సేవలు, ‘స్ట్రీమ్‌ఫెస్ట్’ ఆఫర్ కింద నేడు, రేపు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చని తెలిపిన నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా

నేటి నుంచి ఆఫర్ వచ్చేసింది. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్‌లో ( StreamFest Begins) భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

Netflix Logo (Photo Credits: Netflix)

కొన్ని రోజులుగా సినిమా అభిమనులను నెట్‌ఫ్లిక్స్‌ ఊరిస్తూ బంపర్‌ (Netflix India is Free for Two Days)అంటూ ప్రచారం చేస్తున్న సంగతి విదితమే. నేటి నుంచి ఆఫర్ వచ్చేసింది. సినిమా ప్రేమికుల ఎదురుచూపులకు తెరదించతూ రెండు రోజుల ఫ్రీ ఆఫర్‌ను ప్రకటించింది. స్ట్రీమ్ ఫెస్ట్‌లో ( StreamFest Begins) భాగంగా భారత దేశమంతటా నేడు, రేపు ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చని ఆ సంస్థ తెలిపింది.

ఈ రెండు రోజుల పాటు నెట్‌ఫ్లిక్స్ లో (Netflix India) ఉచితంగా వీడియోలను వీక్షించవచ్చు. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 5 అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ ఆఫర్‌ను మొదటగా మనదేశంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇటువంటి ఆఫర్‌ పెట్టడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటున‍్న ​నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు తమ ఆనందాలను ట్విట్టర్‌ వేదికగా రకరకాల మీమ్స్‌ పెడుతూ నలుగురితో పంచుకుంటున్నారు.

సైన్ చేసుకుని నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీని 48 గంటలపాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఉచిత యాక్సెస్ స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ)కి మాత్రమే పరిమితం. మిగతా అన్నీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్స్‌కు లభించనట్టే లభిస్తాయి. ఇంకా చెప్పాలంటే రూ. 499 బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌లో లభించే అన్ని ప్రయోజనాలు ఈ రెండు రోజుల్లో ఉచితంగా లభిస్తాయి.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లతోపాటు, క్రోమ్‌కాస్ట్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ వంటి స్ట్రీమింగ్ పరికరాల ద్వారా టీవీకి కనెక్ట్ అయి కూడా వీక్షించొచ్చు. ఇందుకోసం ఎవరూ తమ పేమెంట్ వివరాలను కానీ, క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్లను కానీ ఇవ్వాల్సిన పనిలేదు. అలాగే, ఫోన్ నంబరు, ఈమెయిల్స్, పాస్‌వర్డ్ వంటి వాటితో కూడా పనిలేదు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif