New UPI Scam Alert: యూపీఐ వాడుతున్నారా? అయితే సైబ‌ర్ క్రిమిన‌ల్స్ నుంచి మీకు ఈ రిస్క్ పొంచి ఉంది, కొత్త త‌ర‌హాలో డ‌బ్బులు కొట్టేస్తున్న మోస‌గాళ్లు

సైబర్ మోసగాళ్లు ‘మీ యూపీఐ ఐడీ’ ట్రాక్ చేసేస్తారు. తర్వాత మీ ఖాతాలో మనీ స్వాహా చేయడానికి ఆటోపే రిక్వెస్ట్ (Autopay Set Up) పంపుతారు. ఆ రిక్వెస్ట్ చూడగానే పొరపాటున మీరు అప్రూవ్ చేశారంటే.. మీ ఖాతా నుంచే మోసగాళ్లు తమ ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు.

RBI raises UPI Lite transactions limit. (Photo credits: Pixabay)

New Delhi, AUG 17: ఇప్పుడన్నీ డిజిటల్ చెల్లింపులే.. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులను సరళతరం చేసేసింది. క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీ సిస్టమ్ ద్వారా క్షణాల్లో చేసేయొచ్చు. డిజిటల్ చెల్లింపులతోపాటు సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ పేమెంట్స్ (UPI Payments) చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు (New UPI Scam Alert) చేసే అన్ని రకాల కొనుగోళ్లకు మీ మనీ వాడేస్తారు. మీరు ఈ-షాపింగ్, రెస్టారెంట్లు, మాల్స్, పార్కింగ్ ప్లేసెస్ వద్ద యూపీఐ క్యూఆర్ స్కాన్ చేయడంతో సైబర్ మోసగాళ్లు వాటిని తేలిగ్గా తస్కరించగలరు కూడా.

Google Down: ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డౌన్, జీమెయిల్, సెర్చ్, యూట్యూబ్ యాక్సెస్ చేయలేకపోతున్నామంటూ గగ్గోలు పెడుతున్న నెటిజన్లు

సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని నమ్మించడానికి రకరకాల కట్టుకథలు వినిపిస్తుంటారు. గుర్తు తెలియని యూపీఐ ఐడీ నుంచి వచ్చే కలెక్ట్ మనీ లేదా ఆటో పే రిక్వెస్టులను ఆమోదించొద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి రిక్వెస్టులు వస్తే అవి నిజమా? కాదా? అన్న సంగతి చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. సాధారణంగా ఇటువంటి రిక్వెస్టులు సైబర్ మోసగాళ్లే పంపుతుంటారు. సైబర్ మోసగాడు తన నెట్‌ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కోసం మీ యూపీఐ ఐడీ తస్కరిస్తాడు. అటుపై మోసగాళ్లు మీకు నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ కోసం రిక్వెస్ట్ పంపుతారు. అందుకు ఆటో పే ఆప్షన్ ఓకే చేయమని కోరతారు. అదీ కూడా మీకు తెలిసిన వ్యక్తుల పేర్లతో రిక్వెస్ట్ పెడతారు. వాస్తవంగా సదరు సైబర్ మోసగాళ్లు తమ నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ పేమెంట్ కోసం ఇన్సియేట్ చేస్తారు. అటువంటి రిక్వెస్టులను అప్రూవ్ చేస్తే మీ ఖాతా నుంచి మనీ మొత్తం తస్కరిస్తారు సైబర్ మోసగాళ్లు. కనుక ఇటువంటి రిక్వెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పట్ల పూర్తిగా అవగాహన లేని సీనియర్ సిటిజన్లు మోసగాళ్ల భారీగా పడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సీనియర్ సిటిజన్లు తమకు వచ్చిన రిక్వెస్టుల గురించి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా రిక్వెస్ట్ పంపిన వారి యూపీఐ ఐడీ, ఆ వ్యక్తి వివరాలు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి.

మరి కొందరు సైబర్ మోసగాళ్లు ఎమోషనల్ వ్యూహాలు అనుసరిస్తారు. మీ కుటుంబ సభ్యుడినని నమ్మించడానికి ప్రయత్నిస్తుంటారు. యూపీఐ లావాదేవీల పట్ల సీనియర్ సిటిజన్లకు అవగాహన కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైనా యూపీఐ రిక్వెస్టులు పంపినప్పుడు కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల్లో నమ్మకమైన వారిని సంప్రదించేలా సీనియర్ సిటిజన్లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now