Nothing Phone 2a: కేవలం రూ. 19 వేలకే నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌.. మూడు వేరియంట్‌లతో మార్కెట్లో విడుదల, ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఈ ఫోన్ రివ్యూని ఇక్కడ చూడండి!

Nothing Phone 2a Smartphone | Photo - official page

Nothing Phone 2a Smartphone: వన్‌ప్లస్ మాజీ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ నేతృత్వంలోని నథింగ్ బ్రాండ్ నుండి మూడవ స్మార్ట్‌ఫోన్ 'నథింగ్ ఫోన్ 2a' ఎట్టకేలకు అధికారికంగా లాంచ్ అయింది. ట్రాన్స్‌పరెంట్ బాడీ ప్యానెల్ ను కలిగి ఉండే నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రేమికులను ఎంతో ఆకర్షించింది. అయినప్పటికీ నథింగ్ కంపెనీ ఇప్పటివరకు కేవలం రెండు మోడళ్లను మాత్రమే విడుదల చేయగలిగింది. పైగా ఇవి ఖరీదైనవిగా ఉండటం వలన చాలా మంది ఈ నథింగ్ బ్రాండ్ ఫోన్‌లు కొనుగోలు చేయడానికి ఆలోచించే వారు. ఈ నేపథ్యంలో కంపెనీ మిడ్-రేంజ్ ధరలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. భారత మార్కెట్లో నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్ ధరలు రూ. 24 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

తాజాగా విడుదల చేసిన నథింగ్ ఫోన్ 2a స్మార్ట్‌ఫోన్‌ విషయానికి వస్తే ఈ హ్యాండ్‌సెట్ ను ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ప్లాస్టిక్ కవరింగ్, ఐకానిక్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్, లైట్ సిమెట్రీతో ఈ ఫోన్ కూడా తమ ట్రేడ్‌మార్క్ ట్రాన్స్‌పరెంట్ ఫోన్‌ల వలె కనిపిస్తున్నప్పటికీ, మునుపటి మోడళ్లతో పోలిస్తే ఈ ఫోన్ కాస్త దిగువ స్థాయి వెర్షన్ లాగా అనిపిస్తుంది.  అయితే ఇది IP54-రేటెడ్ డస్ట్ రెసిస్టెంట్, వాటర్-రెసిస్టెంట్ బిల్డ్‌ను కలిగి ఉంది

ఈ స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అలాగే బ్లాక్ మరియు వైట్ రెండు కలర్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇంకా, Nothing Phone 2a స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Nothing Phone 2a స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

అదనంగా, నథింగ్ ఫోన్ 2aలో 5G, 4G LTE, Wi-Fi 6, Wi-Fi 6 డైరెక్ట్, బ్లూటూత్ 5.3, NFC, GPS, GLONASS, GALILEO, QZSS, 360 డిగ్రీ యాంటెన్నా మరియు USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. అలాగే ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్ సెన్సార్ , ప్రాక్సిమిటీ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ హై-డెఫినిషన్ మైక్రోఫోన్లు, డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో వస్తుంది.

ధరలు:

8GB RAM+128GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 23,999/-

8GB RAM+256GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 25,999/-

12GB RAM+256GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 27,999/-

ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 12 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. వివిధ బ్యాంక్ ఆఫర్లతో రూ.19,999/- తగ్గింపు ధరకే దీని బేస్ వేరియంట్ ను కొనుగోలు చేయవచ్చు.