OnePlus Nord 2 Explosion Row: వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ కోర్టులో పేలిందని ఆరోపణలు, లాయర్‌కి నోటీసులు పంపిన కంపెనీ, వెంటనే ఫోటోలు డిలీట్ చేయాలంటూ పరువునష్టం దావా

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ పేలిందని (OnePlus Nord 2 Explosion) ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్‌ నోటీసులను (OnePlus sends legal notice to lawyer) పంపింది.

OnePlus Nord 2 (Photo Credits: 91 Mobiles/Twitter/ @Adv_Gulati1)

ఢిల్లీ కోర్టులో నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ పేలిందని ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ పేలిందని (OnePlus Nord 2 Explosion) ఆరోపణలు చేసిన సదరు లాయర్‌కు లీగల్‌ నోటీసులను (OnePlus sends legal notice to lawyer) పంపింది. ఈ నోటీసుల్లో కంపెనీ ప్రతిష్ట దిగజారేలా ఆరోపణలు చేశాడని వన్‌ప్లస్‌ వెల్లడించింది. కాగా ఢిల్లీకి చెందిన గౌరవ్‌ గులాటి ఈ నెల ఎనిమిదో తారీఖున వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌ కోర్టులో ఉండగా తన గౌనులో ఒక్కసారిగా పేలిందని (Nord 2 explosion) ఆరోపణలు చేశాడు.

అంతేకాకుండా స్మార్ట్‌ ఫోన్‌ పేలిన చిత్రాలను ట్విటర్‌లో పోస్ట్‌చేశాడు. వన్‌ప్లస్‌ కంపెనీ వినియోగదారులను మోసం చేస్తోందని కోర్టులో పిటిషన్‌ కూడా వేశాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనంగా మారింది. లాయర్‌ కోర్టులో వన్‌ప్లస్‌ కంపెనీపై పిటిషన్‌ దాఖలు చేయగా..తాజాగా వన్‌ప్లస్‌ యాజమాన్యం పిటిషన్‌ స్పందిస్తూ.. లాయర్‌కు నోటీసులు పంపించింది. సార్ట్‌ఫోన్‌పేలిందటూ లాయర్‌ అనవరంగా ఆరోపణలు చేశారని గౌరవ్‌ గులాటికి వన్‌ప్లస్‌ లీగల్‌ నోటీసులను పంపింది.

మీ ఆధార్ కార్డు ఎన్ని బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయిందో తెలుసుకోవడం చాలా ఈజీ, ఈ స్టెప్స్ ద్వారా మీ ఆధార్ బ్యాంక్ లింకింగ్ గురించి తెలుసుకోండి

లాయర్ తమ నోటీసుల్లో..కంపెనీపై తప్పడు ఆరోపణలు చేశాడని కంపెనీ మండిపడింది. తమ ఫోన్‌లో ఏలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తలేదని వెల్లడించింది. ట్విటర్‌లో పబ్లిష్‌ చేసిన ఫోటోలను వెంటనే డిలీట్‌ చేయాలంటూ కంపెనీ తమ పిటిషన్‌లో పేర్కొంది. లాయర్‌ చేసిన ఆరోపణలతో వన్‌ప్లస్‌ ప్రతిష్ట దిగజారిందని పిటిషన్‌లో పేర్కొంటూ..లాయర్‌పై పరువునష్టం దావాను కూడా వేసినట్లు తెలుస్తోంది.