ఆధార్ నెంబర్ అనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైంది. ఆధార్ కార్డు లేకుంటే ఏ పని జరగని పరిస్థితి నెలకొని ఉంది. ప్రభుత్వ పథకాలు రావాలన్నా.. చివరకు బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే చాలామందికి తమ ఆధార్ కార్డు ఎన్ని బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయిందో తెలుసుకోవడం అనేది చాలా కష్టంగా మారింది. పైగా ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే మొత్తం కూడా ఆధార్ లింక్ అయిన దానిలోనే జమ అవుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆధార్ తో లింక్ అయిన బ్యాంక్ (Aadhaar-Bank Account Linking) అకౌంట్ల గురించి చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. అయితే ఎలా తెలుసుకోవాలో తెలియదు. అటువంటి వాళ్లు ఈ స్టెప్స్ ఫాలో అవడం ద్వారా తమ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిందో (Check Aadhaar/Bank Linking Status) ఈజీగా తెలుసుకోవచ్చు. ముందుగా ఆధార్ కార్డులను జారీ చేసే యూఐడీఏఐ వెబ్‌సైట్ https://uidai.gov.in/ లోకి వెళ్లాలి. దాన్ని ఓపెన్ చేశాక అక్కడ కనిపించే Aadhaar Services అనే ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే మరో పేజి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన పేజీలో Aadhaar Linking Status అనే ఆప్షన్ ఉంటుంది. దాని కింద Check Aadhaar/Bank Linking Status అనే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మరో పేజి ఓపెన్ అవుతుంది.
రేషన్ కార్డు దారులకు కేంద్రం తీపి కబురు, కామన్ సర్వీస్ సెంటర్లలో కూడా సేవలు అందుబాటులోకి
అక్కడ మీ ఆధార్ నెంబర్ లేదా వర్చువల్ ఐడీ ఎంటర్ చేసి.. సెక్యూరిటీ కోడ్ టైప్ చేసి.. సెండ్ ఓటీపీ అనే బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బటన్ మీద క్లిక్ చేయగానే.. ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని వెరిఫై చేయగానే.. ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. బ్యాంక్ లింక్ స్టేటస్, లింక్ అయిన తేదీ.. అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకులు లింక్ అయినా అన్ని బ్యాంకుల వివరాలు అక్కడ ఉంటాయి.