రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. తాజాగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకుంది. దీని వల్ల రేషన్ కార్డుకు సంబంధించిన సేవలు (Ration Card Related Services) దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో (common services centres) కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు మీరు మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) ద్వారా రేషన్ కార్డుకు సంబంధించిన అనేక సేవలను యాక్సెస్ చేసుకోవచ్చునని డిజిటల్ ఇండియా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్‌తో కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 3.70 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ భాగస్వామ్యం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డుదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని" కేంద్రం ట్విటర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈ భాగస్వామ్యం ఒప్పందం వల్ల దేశవ్యాప్తంగా 23.64 కోట్లకు పైగా రేషన్ కార్డు దారులు కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా రేషన్ కార్డు సంబధించిన 6 రకాల సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు