IPL Auction 2025 Live

PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ స్టేటస్ SMS ద్వారా తెలుసుకోవడం ఎలా, సింపుల్ ప్రాసెస్ మీకోసం..

ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది

Representative Image (File Image)

Aadhaar PAN card link status through SMS: పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది. కానీ అదనంగా రూ. 1000 చెల్లించి జూన్ 30 వరకు పాన్-ఆధార్ లింక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చివరి తేదీ కాస్త ముగుస్తుంది.

పాన్- ఆధార్ లింక్ ఈ రోజే చివరి రోజు, ఈ లింక్ ద్వారా వెంటనే చేయండి, లేదంటే పాన్ కార్డు డిలీట్ అవుతుంది

నిర్ణిత సమయంలోపు పాన్-ఆధార్ లింక్ చేయకపోతే పాన్ నంబర్ పనిచేయదు. దీంతో పాన్ ఉపయోగించి ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయలేరు. అలాగే, పాన్ కార్డు పనిచేయకపోవడంతో ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింక్ చేయని వారు ఆదాయపు పన్ను శాఖ వారి అధికారిక వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ వెళ్లి పాన్, ఆధార్ నెంబర్, మిగతా వివరాలను నమోదు చేసి లింక్ చేసుకోవచ్చు.

ఆధార్ పాన్ కార్డ్ లింక్ స్టేటస్ ను ఎస్ఎంఎస్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే..

మీ ఫోన్ లో మెసేజింగ్ యాప్ ఓపెన్ చేయండి.

UIDPAN అని టైప్ చేసి <12 అంకెల ఆధార్ నంబర్ >10 అంకెల పాన్ నంబర్ ను టైప్ చేయండి.

పైన టైప్ చేసిన మెసేజ్ ను 56161 లేదా 567678కి సెండ్ చేయండి.

ఈ స్టెప్స్ తర్వాత మీ ఆధార్- పాన్ లింక్ స్టేటస్ కు సంబంధించిన అప్ డేట్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఎస్ఎంఎస్ వస్తుంది.