Realme12 5G Series: రూ. 16 వేల బడ్జెట్ ధరల్లో రియల్‌మి నుంచి రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు విడుదల, ప్రతి కొనుగోలుపై Realme T300 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ఉచితం, ఈ ఆఫర్ కొద్ది రోజులకు మాత్రమే, పూర్తి వివరాలు చదవండి!
Realme 12 5G Series: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మి తాజాగా మరో రెండు స్మార్ట్‌ఫోన్ మోడళ్లను ఆవిష్కరించింది. Realme 12 5G మరియు Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో విడుదలయ్యాయి. Realme 12 5G సిరీస్ ధరలు రూ. 16,999/- నుంచి ప్రారంభమవుతున్నాయి. సామ్‌సంగ్, మోటరోలా, షియోమి వంటి కంపెనీలకు పోటీగా రియల్‌మి ఈ మిడ్-రేంజ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు మార్చి 6వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల నుంచి కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. మొదటి విడతలో మార్చి 10 వరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు జరగనున్నాయి. ప్రారంభోత్సవ ఆఫర్‌లో భాగంగా
ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై Realme Buds Wireless 3ని కంపెనీ ఉచితంగా అందిస్తోంది. SBI, HDFC , ICICI మొదలైన బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి కొనుగోలు చేసే వారికి రూ. 1,000 తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది.
ఇక, ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ప్రధానం అంశాలను పరిశీలిస్తే ఈ రెండు రెండు హ్యాండ్‌సెట్‌లు ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా Realme UI 5.0 కస్టమ్ UIపై పనిచేస్తాయి. అలాగే ఇవి మీడియాటెక్ చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లు డైనమిక్ ర్యామ్ ఫీచర్‌తో వచ్చాయి, తద్వారా అందుబాటులో ఉన్న మెమరీని 16GB వరకు విస్తరించవచ్చు. ఇందులో Realme 12+ 5G వేరియంట్ ప్రత్యేకమైన రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. ఇది వర్షం కురుస్తున్న సమయంలో లేదా తడి చేతులతో హ్యాండ్‌సెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మెరుగైన టచ్ ఇన్‌పుట్‌ను ఈ ఫీచర్ అందిస్తుంది.
అదనంగా, రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్‌లలో మిగతా ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధరలు ఎంత తదితర విషయాలను ఈ కింద పరిశీలించండి.
Realme 12+ 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లే
- 8GB RAM, 128GB/256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
- వెనకవైపు 50MP + 8MP + 2MP ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 67W SuperVOOC ఛార్జింగ్
- ధరలు:
- 8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 20,999/-
- 8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 21,999/-
ఈ ఫోన్ నావిగేటర్ బీజ్ మరియు పయనీర్ గ్రీన్ అనే రెండు షేడ్స్‌లో లభిస్తుంది.
ఇక, బేస్ మోడల్ లో ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Realme 12 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల పూర్తి HD+ డిస్‌ప్లే
- 6GB /8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
- మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్
- వెనకవైపు 108MP + 2MP కెమెరా సెటప్, ముందు భాగంలో 16MP సెల్ఫీ షూటర్
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 45W SuperVOOC ఛార్జింగ్
- ధరలు:
- 8GB RAM+128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కలిగిన వేరియంట్ ధర: రూ. 16,999/-
- 8GB RAM+256GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర: రూ. 17,999/-
ఈ ఫోన్ వుడ్‌ల్యాండ్ గ్రీన్ మరియు ట్విలైట్ పర్పుల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)