Redmi A3x: రూ. 7 వేల ధరలో రెడ్ మీ ఏ3ఎక్స్ మార్కెట్లోకి వచ్చేసింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X) ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999 పలుకుతుంది.
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం రెడ్‌మీ (Redmi) తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X)ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X) ఫోన్ 3జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999 పలుకుతుంది. అమెజాన్, షియోమీ ఇండియా వెబ్‌సైట్‌ల్లో ఈ ఫోన్ లభిస్తుంది. మిడ్ నైట్ బ్లాక్, ఓషియన్ గ్రీన్, అలీవ్ గ్రీన్, స్టారీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
యూనిసోక్ టీ 603 ప్రాసెసర్ తో పాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో ఫోన్ వస్తోంది. సర్క్యులర్ కెమెరా డెకో డిజైన్, ట్రాన్స్‌పరెంట్ మిర్రర్ షీన్ గ్లాస్ రేర్ ప్యానెల్‌తో అందుబాటులో ఉంటుంది.రెడ్ మీ ఏ3ఎక్స్ (Redmi A3X) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.71 అంగుళాల హెచ్డీ+ (720×1650 పిక్సెల్స్) ఎల్‌సీడీ డాట్ డ్రాప్ స్క్రీన్ కలిగి ఉంటుంది.
తొమ్మిది వేలకే శాంసంగ్ 5జీ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీతో ప్రైమరీ కెమరాతో పాటు మిగతా ఫీచర్లు అదుర్స్
ఫోన్ 4జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. వర్చువల్ గా 8 జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు. 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ గల ఈ ఫోన్ లో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ విస్తరించొచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హైపర్ ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతో డ్యుయల్ రేర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
యూఎస్బీ టైప్-సీ పోర్ట్ చార్జింగ్ ద్వారా 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 4జీ ఎల్టీఈ, వై-ఫై 5.4, జీపీఎస్ కనెక్టివిటీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. ఈ సెన్సర్ ఫేన్ అన్ లాక్‌కు మద్దతుగా ఉంటది.