దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తాజాగా భారత మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్ ఒకటి లాంఛ్ చేసింది. అదే.. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14. కేవలం రూ. 8,999కే అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఫీచర్లు చూస్తే... 6.7 ఇంచెస్‌తో కూడిన 1080పీ డిస్‌ప్లేతో వస్తోంది. 90 హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో వేగంగా కార్యకలాపాలు కొనసాగించవచ్చు. ఇందులోని ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఒన్‌యూఐ 6.1 ఓఎస్‌తో రన్ అవుతుంది. భారత మార్కెట్లోకి జియో మరో సంచలన 4జీ ఫోన్, రూ. 1799కే జియో భారత్ జే1 4జీ ఫీచర్ ఫోన్, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి
కెమరా విషయానికి వస్తే... 50 ఎంపీతో ప్రైమరీ కెమరా, 2 ఎంపీతో మరో రెండు కెమరాలుంటాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 13 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఫోన్ లో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5.1, జీపీఎస్ వంటి ఫీచర్లను అందించారు. గతేడాది తీసుకొచ్చిన గ్యాలక్సీ ఎఫ్14 ఫోన్‌కి అప్‌డగ్రేడ్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999గా నిర్ణయించారు.