JioPhone Exclusive Offer: రూ.1500 ఫీచర్ ఫోన్‌ని రూ.700కే సొంతం చేసుకోండి, అలాగే రూ.700 విలువ చేసే డాటా ప్రయోజనాలు పొందండి, ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకు మాత్రమే పరిమితం
అదే ఊపును కొనసాగిస్తూ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఇప్పుడు మరో బంపరాఫర్ ను ప్రకటించింది.
October 1: దేశీయ టెలికం రంగంలో దూసుకుపోతున్న టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మొబైల్ మార్కెట్లో కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. అదే ఊపును కొనసాగిస్తూ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ఇప్పుడు మరో బంపరాఫర్ ను ప్రకటించింది. కస్టమర్లకు జియోఫోన్ ను రూ.699కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దసరా దీపావళి ఫెస్టివ్ సీజన్‌లో భాగంగా కంపెనీ ఈ ఆఫర్ ను ప్రకటించింది. 500 మిల్లియన్ సబ్ స్క్రైబర్లను చేరుకోవడం, అలాగే కప్టమర్లు 2జీ నుంచి 4జీకి మారే విధంగా తయారుచేయడం వంటి లక్ష్యాలతో జియో ఈ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. దసరా, దీపావళి పండుగ సీజన్ లో భాగంగా జియో ఫోన్ ను ఇంత తక్కువ ధరకే వినియోగదారులకు అందజేస్తోంది. జియో ఫోన్ ధర మార్కెట్లో రూ.1500గా ఉంది. మొత్తం మీద ఎటువంటి షరతులు లేకుండా ఈ ఫోన్ రూ.800 తగ్గింపును అందుకోనుంది. ఎటువంటి కండీషన్లు లేకుండా అలాగే పాత ఫోన్ల ఎక్స్చేంజ్ అవసరం లేకుండా ఈ తగ్గింపును యూజర్లు అందుకోవచ్చని జియో తెలిపింది.
అంతేకాకుండా నూతనంగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ.700 విలువ చేసే డాటాను అందించనుంది. ఇందులో భాగంగా వినియోగదారుడి చేసుకునే ఒక్కో రీచార్జ్‌కు అదనంగా రూ.99 విలువైన డాటాను జియో అందిస్తుంది. ఇది మొదటి ఏడు రీచార్జ్‌లకు వర్తిస్తుంది. ఫోన్ కొనుగోలుపై రూ.800, ఏడు రీచార్జీల డేటా విలువ రూ.700 కలిపి వినియోగదారుడు రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కాగా ఈ ఆఫర్ దసరా నుంచి దీపావళి వరకే అందుబాటులో ఉండనుంది.