Jio Discount Offers: జియో మరో బంపరాఫర్, పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ.50 తగ్గింపు, రూ.444, రూ.555 ప్యాక్‌లపై మాత్రమే, కోడ్ వివరాలు తెలుసుకోండి

రూ.399 రీఛార్జ్ కు 1.5 జిబి డేటాను అందిస్తున్న జియో దానికి అదనంగా ఐయూసీ ఛార్జీలను తీసుకుంటోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ ల పేరుతో రూ.444, రూ.555 ఆఫర్లను ప్రవేశపెట్టింది.

reliance-jios-rs-444-and-rs-555-prepaid-plans-now-available-discount-benefits-and-validity (Photo-PTI)

November 4: దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ఐయూసీ ఛార్జీలు అమల్లోకి వచ్చిన తరువాత రీఛార్జ్ ప్యాక్ రేట్లు పెరిగిపోయాయి. రూ.399 రీఛార్జ్ కు 1.5 జిబి డేటాను అందిస్తున్న జియో దానికి అదనంగా ఐయూసీ ఛార్జీలను తీసుకుంటోంది. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన తరువాత జియో ఆల్ ఇన్ వన్ ప్యాక్ ల పేరుతో రూ.444, రూ.555 ఆఫర్లను ప్రవేశపెట్టింది. అయితే ఈ ప్యాక్ ల మీద అదనంగా డేటా ఇస్తున్నప్పటికీ రూ.45 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు నిరాశ చెందుతున్నారు.

ఈ విషయాన్ని గమనించిన రిలయన్స్ జియో యూజర్లకోసం డిస్కౌంట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో, డిజిటల్ వ్యాలెట్ పేటిఎమ్‌తో టైఅప్ అయింది.

యూజర్లు రూ.444, రూ .555 ప్యాక్ ల కోసం పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే వారికి డిస్కౌంట్ అందిస్తోంది. రూ.444తో పేటీఎం ద్వారా రీఛార్జ్ చేసుకుంటే రూ. 44 డిస్కౌంట్ అందిస్తోంది. రూ .555 ప్యాక్ తో రీఛార్జ్ చేసుకుంటే 50 రూపాయలు తగ్గింపు వస్తుంది. నేరుగా చెల్లించాల్సిన అమౌంట్‌లోనే ఈ డిస్కౌంట్ వస్తుంది. రూ.444ప్యాక్ కోసం SHUBHP44 అనే ప్రొమో కోడ్ అప్లై చేస్తే కేవలం రూ.400చెల్లిస్తే సరిపోతుంది. అదే రూ.555ప్యాక్ కోసం SHUBHP50 చెల్లిస్తే రూ.505 చెల్లించాలి. షుబ్ పేటీఎమ్ ఆఫర్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేటీఎమ్ ఈ ఆఫర్ ప్రకటించింది.

రూ.444ప్యాక్ తో రోజుకు 2జీబీ డేటా, జియో టు జియో అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లు మాట్లాడేందుకు వెయ్యి నిమిషాలు వస్తాయి. అదే రూ.555 ప్యాక్ తీసుకుంటే రోజుకు 2జీబీ డేటా, జియో టు జియో అన్ లిమిటెడ్ కాల్స్, ఇతర నెట్ వర్క్ లు మాట్లాడేందుకు 3వేల నిమిషాలు వస్తాయి. ఈ ప్యాక్ లు వాడే వారు ఐయూసీ టాప్ అప్ ప్రత్యేకంగా రీచార్జ్ చేయించుకోనవసర్లేదు. వొడాఫోన్-ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్, ఇతర టెలికాం ఆపరేటర్లకు మాట్లాడేసుకోవచ్చు.