Reliance Retail: రిలయన్స్‌లోకి వెల్లువలా పెట్టుబడులు, తాజాగా రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపిన సిల్వర్ లేక్, ఇప్పటికే జియోలో 1.35 బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టిన అమెరికా దిగ్గజం
ఆ పెట్టుబడితో ఆర్ఆర్‌వీఎల్‌లో సిల్వర్ లేక్ సుమారు 1.75 శాతం వాటాను సొంతం (Reliance Retail Ventures Sells 1.75% Stake to Silver Lake) చేసుకుంది. రిలయన్స్ సంస్థలో సిల్వర్ లేక్ .. బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడం ఇది రెండవ సారి.
అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ రిటేల్ వెంచర్స్‌లో రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఇవాళ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ పేర్కొన్నది. ఆ పెట్టుబడితో ఆర్ఆర్‌వీఎల్‌లో సిల్వర్ లేక్ సుమారు 1.75 శాతం వాటాను సొంతం (Reliance Retail Ventures Sells 1.75% Stake to Silver Lake) చేసుకుంది. రిలయన్స్ సంస్థలో సిల్వర్ లేక్ .. బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడం ఇది రెండవ సారి. ఈ డీల్‌తో రిలయన్స్ రిటైల్ విలువ రూ. 4.21 లక్షల కోట్లకు చేరినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డిజిటల్ అనుబంధ విభాగమైన రిలయన్స్ జియోలో (Reliance) సైతం సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసింది.
ఈ ఏడాది ఆరంభంలో సిల్వర్ లేక్ 1.35 బిలియన్ల డాలర్లు ( సుమారు 10,202 కోట్లు) జియోలో (Jio) పెట్టుబడి పెట్టింది. దీంతో రిలయన్స్ షేర్లు ఒక శాతం వృద్ధి సాధించాయి. రిలయన్స్ రిటేల్ వ్యాపారం (Reliance Retail Ventures Limited) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నది. 12 వేల స్టోర్ట్స్ ఉన్నాయి. రిలయన్స్ రిటేల్ కొత్త వాణిజ్య విధానాన్ని అవలంబిస్తున్నది. చిన్న, అసంఘటిత వ్యాపారుల డిజిటలైజేషన్ ఇటీవల రిలయన్స్ ప్రారంభించింది. సుమారు రెండు కోట్ల మంది వ్యాపారులు రిలయన్స్ రిటేల్‌తో అనుసంధానమై ఉన్నారు.
డిజిటల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో బాటలో రిలయన్స్ రిటైల్‌లోనూ మైనారిటీ వాటా విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమకూర్చుకునే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కంపెనీ వృద్ధి కోసం ఆర్‌ఐఎల్ వివిధ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలియజేశాయి. రిలయన్స్ రిటైల్‌లో 10 శాతంవరకూ వాటాను విక్రయించే ప్రణాళికల్లో ముకేశ్ అంబానీ ఉన్నట్లు చెబుతున్నారు.
గత నెలలో కిశోర్ బియానీ సంస్థ ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్ బిజినెస్‌లను ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ రిటైల్ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇందుకు రూ. 24,713 కోట్ల డీల్‌ను కుదుర్చుకుంది. తద్వారా దేశీ రిటైల్ రంగంలో కన్సాలిడేషన్ ద్వారా రిలయన్స్ గ్రూప్.. రిటైల్ బిజినెస్‌ను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు నిపుణులు తెలియజేశారు. మరోవైపు ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్(వాల్‌మార్ట్)కు పోటీగా జియో మార్ట్ ద్వారా రిలయన్స్ రిటైల్ వేగంగా విస్తరిస్తున్నట్లు వివరించారు. 2006లో ప్రారంభమైన రిలయన్స్ రిటైల్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11,806 స్టోర్లను కలిగి ఉంది.