CM Revanth Reddy says Complete Mir Alam bridge in 30 months(CMO)

Hyd, Feb 9:  హైదరాబాద్ నగరంలో మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని( CM Revanth Reddy On Mir Alam Lake) అత్యంత ప్రముఖ ప్రాంతంగా తీర్చిదిద్దాలని, చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జి చుట్టుపక్కల ప్రాంతాలను ఆకర్షణీయంగా మార్చాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి రివ్యూ నిర్వహించారు.

మీర్ ఆలం ట్యాంక్‌(Mir Alam Tank) పై 2.4 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 90 రోజుల్లో డీపీఆర్ సిద్ధం చేయడంతో పాటు 30 నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.   తెలంగాణ టీజీ లాసెట్, పీజీ ఎల్‌ సెట్, ఈసెట్ షెడ్యుల్ వచ్చేసింది.. ఉన్నత విద్యామండలి విడుదల చేసిన వివరాలు ఇవిగో..

గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫ్లైఓవర్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ అంశాలపై రెండు రోజుల్లో సమగ్ర సమాచారంతో మరోసారి సమీక్షకు రావాలని చెప్పారు.

ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, దాన కిషోర్,జీహెచ్‌ఎంసీ ఇలంబర్తి, మూసీ రివర్ ఫ్రంట్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.