Samsung India Layoffs: శాంసంగ్ ఇండియాలో లేఆఫ్స్ కలవరం, 200 మందిపై వేటు వేయనున్న టెక్ దిగ్గజం
వ్యాపార వృద్ధి మందగించడం, వ్యయ నియంత్రణ, డిమాండ్ లేమి వంటి కారణాలతో ఉద్యోగులను కుదించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ భారత్ ఆపరేషన్స్‌కు చెందిన 200 మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వ్యాపార వృద్ధి మందగించడం, వ్యయ నియంత్రణ, డిమాండ్ లేమి వంటి కారణాలతో ఉద్యోగులను కుదించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం. మొబైల్ ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, సపోర్ట్ ఆపరేషన్స్ వంటి పలు విభాగాల్లో లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం
భారత్‌లో శాంసంగ్ ఎగ్జిక్యూటివ్‌లు దాదాపు 2000 మంది ఉండగా వీరిలో 9 నుంచి 10 శాతం ఉద్యోగులపై తాజా లేఆఫ్స్ ప్రభావం ఉంటుంది. కంపెనీ చెన్నై ఫ్యాక్టరీలో కార్మికులు సమ్మెలో ఉన్న సమయంలో లేఆఫ్స్ వార్తలు ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. సమ్మె మూడో రోజుకు చేరుకోగా ఫ్యాక్టరీ సామర్ధ్యంలో 50 శాతం నుంచి 80 శాతం వరకే ఉత్పత్తి జరుగుతోంది.