Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం

కరోనా మహమ్మారి విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది.

Flesh Eating Bacteria (Credits: X)

Newdelhi, June 17: కరోనా మహమ్మారి (Corona) విలయం నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటున్న ప్రపంచ దేశాలను మరో బ్యాక్టీరియా కలవరానికి గురిచేస్తుంది. మనిషి మాంసాన్ని తినే ప్రాణాంతక బ్యాక్టీరియా (Flesh Eating Bacteria) జపాన్‌ రాజధాని టోక్యోలో వేగంగా విస్తరిస్తున్నది. సైన్స్ భాషలో  స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) గా పిలిచే ఈ బ్యాక్టీరియా కరోనా కంటే డేంజరస్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూన్ 2 నాటికి జపాన్ లో ఈ తరహా కేసులు 977 వరకూ నమోదయ్యాయి. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో మరణాల రేటు 30 శాతం వరకూ ఉన్నట్టు చెబుతున్నారు.

బ‌క్రీద్ సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ఈ రూట్ల‌లో వెళ్లే ముందు ఒక‌సారి ఆలోచించుకోండి! ప్ర‌త్యామ్నాయ మార్గాలివే

ఎక్కడ జీవిస్తుంది?

ఈ ప్రాణాంతక బ్యాక్టీరియా రోగుల పేగుల్లో జీవిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మలం ద్వారా చేతులను కలుషితం చేస్తుందని, కాబట్టి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఒంటిపై గాయాలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవాలని హెచ్చరిస్తున్నారు.

కుడివైపు గుండె ఉంద‌ని పెళ్లైన 16 రోజుల‌కే భార్య‌ను వ‌దిలేశాడు, కోర్టు చెప్పినా విన‌ని ప్ర‌భుద్దుడు, న్యాయం చేయాలంటూ వీధికెక్కిన మ‌హిళ‌

లక్షణాలు ఏంటి?

బ్యాక్టీరియా సోకగానే గొంతు నొప్పి, వాపు వంటి తేలికపాటి అనారోగ్య లక్షణాలు మొదలవుతాయి. గంటల వ్యవధిలోనే క్రమంగా శరీరంలోని అవయవాల్లో నొప్పి, వాపు, జ్వరం, లోబీపీ, శరీర కణజాలం మొత్తం నాశనమవుతుంది. వ్యాధి మరింత ముదిరి అవయవాలు పూర్తిగా దెబ్బతిని మరణానికి దారితీస్తుంది. రోగికి ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపిస్తుందని.. ఆ తర్వాత 48 గంటల్లోనే ప్రాణం తీస్తుందని పరిశోధకులు చెప్పారు.

ఇది క‌దా ఓ తండ్రికి కావాల్సింది! ట్రైయినీ క‌లెక్ట‌ర్ గా వ‌చ్చిన కూతురికి సెల్యూట్ చేసి స్వాగ‌తం ప‌లికిన ఐపీఎస్ తండ్రి 

ఏ వయసుల వారికి ప్రమాదం?

ఈ బ్యాక్టీరియా కేసులు 30 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా నమోదవుతున్నాయి. 50 ఏళ్లు పైబడిన వారికి ఈ వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది. ఈ బ్యాక్టీరియాతో చాలా మరణాలు 48 గంటల్లోనే సంభవిస్తున్నట్లు జపాన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచ దేశాలకూ ఈ వ్యాధి విస్తరించే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.



సంబంధిత వార్తలు

Shocking Truths About Water Bottles: మ‌నం వాడే వాట‌ర్ బాటిల్స్ టాయిలెట్స్ సీట్ల కంటే డేంజర్! షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన నిపుణులు

Maharashtra Shocker: స్కూల్లో బిస్కెట్లు తిన్న 150 మంది విద్యార్థులకు వాంతులు, మహారాష్ట్రలో విషాదకర ఘటన

What is STSS? వామ్మో ఈ సారి జపాన్ నుంచి కరోనా కన్నా డేంజరస్ వైరస్, 48 గంటల్లో మనిషిని చంపేసే స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లక్షణాలు గురించి తెలుసుకోండి

Flesh Eating Bacteria: జపాన్ ను వణికిస్తున్న మనిషి మాంసాన్ని తినే బ్యాక్టీరియా.. వ్యాధి సోకిన రెండు రోజుల్లోనే చంపేస్తున్న మహమ్మారి.. ఉదయం పాదంలో వాపును గమనిస్తే మధ్యాహ్నానికి మోకాలి వరకు వ్యాపించే డేంజరస్ బ్యాక్టీరియా.. ప్రపంచ దేశాలకూ వ్యాపించే ప్రమాదం