Aditya L1 Launch Today: చంద్రయాన్‌-3 సూపర్ సక్సెస్ తర్వాత ఆదిత్య-ఎల్‌1 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. ఉ.11.50 గంటలకు ప్రయోగం.. సూర్యుడిపై అధ్యయనం చేయడమే లక్ష్యం

చంద్రయాన్‌-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది.

Aditya L1 (Credits: X)

Newdelhi, Sep 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3తో (Chandrayaan-3) జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై విజయవంతంగా అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన ఇస్రో.. ఇక భానుడిపై దృష్టిసారించింది. సూర్యుడిపై (Sun) అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్‌-1(Aditya L1)ను ప్రయోగించనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ఇందుకు వేదిక కానున్నది. ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను మోసుకుంటూ పీఎస్‌ఎల్వీ-సీ57 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇప్పటికే ప్రయోగ రిహార్సల్‌ విజయవంతం అవగా.. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కూడా మొదలైంది. కౌంట్‌డౌన్‌ ముగిసిన వెంటనే సరిగ్గా ఉదయం 11.50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనున్నది.

Heavy Rain Alert: రాబోయే వారంరోజులు తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాలకు అలర్ట్ జారీచేసిన ఐఎండీ, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం

ఇదే మొదటి శాటిలైట్

సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణంపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్‌ ఇదే కావడం విశేషం.

Telangana Shocker: రాత్రి ఇంట్లో మద్యం సీసాలు, అక్క అనుమానాస్పద మృతి, తెల్లారేసరికి ప్రియుడితో చెల్లెలు పరార్, మిస్టరీగా మారిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి 

పేలోడ్లు ఇవీ..