Asteroid Towards Earth: గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమిపైకి దూసుకొస్తున్న భారీ గ్రహ శకలం.. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ పరిమాణంలో ఉంది మరి.. జాగ్రత్త.. అంటూ నాసా హెచ్చరికలు

రోజూ వేరే గ్రహాలమీద ఎన్నో ఉల్కాపాతాలు జరుగుతున్నాయి. అయితే, అక్కడ జనావాసాలు లేకపోవడంతో ముప్పు లేదు.

Earth

Newdelhi, July 7: గ్రహ శకలాలు (Asteroid), ఉల్కాపాతాలు ఎన్నటికైనా ప్రమాదమే. రోజూ వేరే గ్రహాలమీద ఎన్నో ఉల్కాపాతాలు జరుగుతున్నాయి. అయితే, అక్కడ జనావాసాలు లేకపోవడంతో ముప్పు లేదు. అయితే, భూమి (Earth) పరిస్థితి అలాకాదు. ఇప్పుడు అలాంటి విషయమే ఇది. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ పరిమాణంలో ఉండే ఓ భారీ గ్రహ శకలం (ఆస్టరాయిడ్‌) ఒకటి భూమిపైకి దూసుకొస్తున్నదని ‘నాసా’ (NASA) ప్రకటించింది. ‘2024 ఎంటీ1’ అనే పేరు గల ఈ గ్రహ శకలం అంతరిక్షంలో గంటకు 65,215 కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తున్నదని నాసా హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆదివారం భూమికి అత్యంత సమీపంగా రానున్నదని తెలిపింది. దాదాపు 260 మీటర్ల వ్యాసం కలిగిన ఈ గ్రహశకలాన్ని నాసా ట్రాక్‌ చేస్తున్నది.

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు

ఢీ కొనదని  చెప్పలేం: శాస్త్రవేత్తలు

‘2024 ఎంటీ1’ భూమిని దాటుతున్న సమయంలో రెండింటి మధ్య సుమారుగా 15 లక్షల కి.మీ దూరం ఉంటుందని, అయినప్పటికీ భూమిని ఢీ కొనదని కచ్చితంగా చెప్పలేమని సైంటిస్టుల అంటున్నారు.

వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి