Chandrayaan-3: విక్రమ్‌ ల్యాండ్‌ అయిన 4 గంటల తర్వాత బయటకు వచ్చిన ప్రగ్యాన్‌ రోవర్‌, 14 రోజుల పాటు 1,640 అడుగులు వరకు చంద్రునిపై ప్రయాణం చేయనున్న రోవర్

ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది.

Ch-3 Rover ramped down from the Lander (photo-ISRO)

చంద్రునిపై విక్రమ్‌ ల్యాండ్‌ అయిన నాలుగు గంటల తర్వాత అంటే రాత్రి 10.04 గంటలకు ప్రగ్యాన్‌ రోవర్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం జాబిల్లిపై అడుగుపెట్టిన రోవర్‌ ‘ప్రజ్ఞాన్‌’.. చంద్రుడిపై తన అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటికే ల్యాండర్‌ క్షేమంగా దిగడంతో భారత్‌ సంబరాలు చేసుకుంటున్న వేళ.. రోవర్‌కూడా సక్సెస్‌ఫుల్‌గా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనిపై ఇస్రో స్పందిస్తూ ట్వీట్‌ చేసింది ‘చంద్రయాన్‌-3 రోవర్‌ చంద్రుడి కోసం భారత్‌లో తయారైంది. అది ల్యాండర్‌ నుంచి సజావుగా బయటకు వచ్చింది. భారత్‌ చంద్రుడిపై నడిచింది. మిషన్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ తర్వలోనే షేర్‌ చేస్తాం’ అంటూ పేర్కొంది.

చంద్రునిపై అన్వేషణ ప్రారంభించిన రోవర్, విక్రమ్ నుంచి బయటికొచ్చిన ల్యాండర్ వీడియో ఇదిగో, 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు

మైక్రోవేవ్‌ సైజ్‌ ఉన్న ప్రజ్ఞాన్ రోవర్‌.. చంద్రుని ఉపరితలంపై 500 మీటర్లు (1,640 అడుగులు) వరకు ప్రయాణించేలా రూపొందించారు. దీని బరువు 26 కిలోలు.రోవర్‌లో కెమెరా, స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్‌తో సహా అనేక రకాల పరికరాలతో అమర్చారు. ఇది చంద్రునిపై వాతావరణం, భూగర్భ శాస్త్రం, ఖనిజశాస్త్రం, చరిత్ర, స్థితిగతుల గురించి అధ్యయనం చేయడానికి ప్రయోగాలు చేస్తుంది.

Here's Video

ఆరు చక్రాలతో కూడిన రోవర్‌ ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్‌ వేగంతో ముందుకు కదులుతోంది. ఆరు చక్రాల సాయంతో చంద్రుడి ఉపరితలంపై 14 రోజులు తిరుగుతూ పనిచేస్తుంది. ఇందులో రెండు పేలోడ్‌లు ఉన్నాయి. రోవర్‌ సోలార్ ప్యానెల్స్ ద్వారా శక్తిని పొంది చంద్రయాన్-3 ఆర్బిటర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది.