Pragyan Rover Rolls Out and Begins Exploration of Uncharted Lunar Surface

చంద్రయాన్-3 ల్యాండింగ్ విజయవంతమైంది. సాఫ్ట్ ల్యాండింగ్ బుధవారం ప్రక్రియ ముగిసింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రపుటల్లోకి ఎక్కింది. చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధన రంగంలో ఇస్రో ప్రపంచశక్తిగా నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దశ, దిశ ఒనగూడింది. కాగా, విక్రమ్ ల్యాండర్‌ను దిగ్విజయంగా చంద్రుడిపై చేర్చిన ఇస్రో తదుపరి చర్యలకు పూనుకుంది.

చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ నుండి ప్రగ్నాన్ రోవర్ విజయవంతంగా బయటికి వచ్చింది. ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుండి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ దిగింది. విక్రమ్‌ ల్యాండర్ నుంచి బయటకొచ్చిన ప్రగ్యాన్‌ రోవర్ 14 రోజులు చంద్రుడిపై పరిశోధనలు చేయనుంది. సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను రోవర్, ల్యాండర్ శోధిస్తాయి. ఇందుకోసం ఆధునిక పరికరాలను ఇస్రో (ISRO) జాబిలిపైకి పంపింది. ప్రజ్ఞాన్‌ సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ల్యాండర్‌ ర్యాంపు ద్వారా వడివడిగా బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఈ విజయంకోసం నాలుగేళ్లు ఎదురుచూశా! చంద్రయాన్-3 విజయవంతంపై ఇస్రో మాజీ చీఫ్ శివన్ హర్షం, గతంలో చంద్రయాన్-2 విఫలంతో వెక్కి వెక్కి ఏడ్చిన శివన్

14 రోజుల పాటు జాబిల్లి ఉపరితలంపై తిరగనున్న ప్రగ్నాన్ రోవర్.. చంద్రుడిపై ఉన్న మట్టి, నీటిపై రసాయన పరిశోధన జరపనుంది. కీలకమైన ఐదు పెలోడ్ల ఆధారంగా ఈ పరిశోధన జరగనుంది. చంద్రుడిపై వాతావరణం ఎలా ఉంది..? అని పరిశోధించిన సమాచారాన్ని రోవర్ భూమికి చేరవేయనుంది. పరిశోధించిన ఈ సమాచారాన్ని రోవర్ నేరుగా భూమికే పంపనుంది. కాగా, ల్యాండర్‌కు మాత్రమే రోవర్ కమ్యూనికేట్ చేయనుంది.

Here's Viral Video

ఇక ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన తర్వాత ఇస్రో మరో కొత్త ఫోటోను విడుల చేసింది . ల్యాండింగ్ ఇమేజ్ కెమెరా ఈ ఫోటోను తీసిందని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ లోని కొంత భాగం ఇందులో కనిపిస్తోందని చెప్పింది. అలాగే ల్యాండర్ లెగ్ నీడను కూడా ఇందులో చూడొచ్చని ట్వీట్ చేసింది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ 3 ప్లాట్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుందని ఇస్రో వివరించింది.