Maruti Suzuki Jimny (photo-Maruti)

జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ 2023లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది కాలం తేవకముందే అంతర్జాతీయంగా దాని ప్రయాణం ప్రారంభమైంది. ఈ వాహనం ప్రధానంగా భారతదేశంలో తయారవుతుంది, అయితే అది జపాన్, మెక్సికో, ఆస్ట్రేలియా సహా 100కి పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది. ప్రత్యేకించి నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే జపాన్ మార్కెట్లో‘జిమ్నీ నొమాడ్’ పేరుతో ఈ ఏడాది జనవరిలో విడుదల అయినది. కొద్ది రోజులలోనే 50,000కు పైగా ఆర్డర్లు రావడం విశేషం.

ఈ విజయంపై మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో హిసాషి టేకుచి హర్షం వ్యక్తం చేశారు. ఆయన ప్రకారం.. జిమ్నీ 5-డోర్ లక్ష ఎగుమతుల మార్కును దాటడం మాకు గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లు చూపిన నమ్మకానికి మేం కృతజ్ఞతలు తెలుపుతున్నాం.జిమ్నీ ఎస్‌యూవీ యొక్క ఆఫ్-రోడ్ సామర్థ్యం, నమ్మకమైన పనితీరు, మరియు అత్యున్నత నాణ్యత అనేక దేశాల్లో ప్రశంసలు పొందుతున్నాయని ఆయన తెలిపారు.

ఎలక్ట్రిక్‌ ఆటో సెగ్మెంట్‌లోకి బజాజ్, గోగో బ్రాండ్‌తో రెండు సరికొత్త ఆటోలను విడుదల చేసిన దిగ్గజం, ధరలు ఎంతంటే..

జిమ్నీ విజయం మాత్రమే కాదు, మారుతి సుజుకి మొత్తం వాహనాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరపు ప్రథమార్ధంలోనే కంపెనీ 2 లక్షలకు పైగా వాహనాలను ఎగుమతి చేసి 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. భారత్‌లోని ప్రయాణికుల వాహన ఎగుమతుల విభాగంలో మారుతి సుజుకి 46 శాతం పైగా వాటా కలిగివుండటం, భారత దేశాన్ని ప్రపంచస్థాయి ఆటోమొబైల్ తయారీ కేంద్రంగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీ విజయం, వాహనాల ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి భారత ఆటోమొబైల్ పరిశ్రమకు గ్లోబల్ గుర్తింపును తెచ్చిన ఘనతగా నిలిచింది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ కల్పనను కచ్చితంగా ప్రతిబింబిస్తుంది. దేశీయంగా రూపొందించిన వాహనాలు కేవలం భారతంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటున్నాయి.