Chandrayaan 3 Mission: జాబిల్లిపై మానవుడు జీవించే కాలం త్వరలోనే, చంద్రుడిపై ఆక్సిజన్‌ను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్, హైడ్రోజన్ కోసం కొనసాగుతున్న వేట
తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది.
చంద్రుడి మీదకు చేరిన చంద్రయాన్-3 ల్యాండర్ రోవర్ జాబిల్లి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. తాజాగా ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది.
చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం(Cr), టైటానియం(Ti), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), సిలికాన్(Si), అల్యూమినియం(Al), ఇనుము(Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో.ఇక హైడ్రోజన్ (హెచ్)కోసం అన్వేషణ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది.
ఈ గుట్టుతో చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్టయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్ జాడ కనిపించడం చాలా కీలకం అవనుంది. సల్ఫర్‌ను మంచు నీటి ఉనికికి సంకేతం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఈ రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. దీన్ని సూపర్ బ్లూ మూన్ అంటారు.
Here's ISRO Tweet
ఇదిలా ఉంటే ల్యాండర్ వి నుంచి క్రమ్‌రోవర్ ప్రజ్ఞాన్ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి వారం రోజులు పూర్తయ్యింది. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 29 వరకు మొత్తం ఏడు రోజుల వ్యవధిలో చంద్రయాన్–3 మిషన్ ఏమేం చేసింది? అనే వివరాలను ఇస్రో బహిర్గతం చేసింది. దీని ప్రకారం ఆగస్టు 26 నాటికే తొలి రెండు లక్ష్యాలు నెరవేరాయి. ఆగస్టు 27న చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల మార్పుల వివరాలను రోవర్ ప్రజ్ఞాన్ భూమిపైకి చేరవేసింది.
చంద్రుడు చల్లగా ఉండడని, ఉపరితలంపై 70 డిగ్రీల దాకా వేడి ఉంటుందని తేల్చింది. ఆగస్టు 28న తన ప్రయాణానికి 4 మీటర్ల లోతున్న గొయ్యి అడ్డు రావడంతో ఇస్రో కమాండ్స్‌ను పాటిస్తూ రోవర్ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ మిషన్‌కు ఇంకా వారం రోజుల కాల వ్యవధి మిగిలి ఉంది. ఈ ఏడు రోజుల్లో ల్యాండర్, రోవర్ ఏం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.