Alcohol Effect: ఇదేందయ్యా.. ఇది..?! తాత మద్యం సేవిస్తే ఆ తర్వాత పుట్టిన మనుమలు, మనువరాళ్ళపై కూడా దుష్ప్రభావం.. తాజా పరిశోధనలో వెల్లడి
అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి.
Newdelhi, Sep 2: మద్యపానం (Alcohol) హానికరం. అది మీ ఆరోగ్యాన్ని (Health) పాడు చేస్తుందని సినిమాల్లో హెచ్చరికలు చేయడం చూసే ఉంటాం. అయితే, మద్యం దుష్ప్రభావాలు తరతరాలపాటు వెంటాడతాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. అతిగా మద్యం సేవిస్తే అది తర్వాతి తరాల్లో పుట్టే మనుమలు, మనుమరాళ్ళ జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని తెలుస్తున్నది. తాత, తండ్రి వంటి పితృ సంబంధీకులు మద్యపానానికి అలవాటు పడితే, దాని ప్రభావం వారి సంతానం ఆరోగ్యం, ప్రవర్తనలపై పడుతుందని వెల్లడైంది.
పిల్లలు వేగంగా వృద్ధులవుతారట
తల్లిదండ్రులిద్దరూ అతిగా మద్యం సేవించేటట్లయితే, వారి పిల్లలు వేగంగా వృద్ధులవుతారని, వ్యాధులబారిన త్వరగా పడతారని తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అతిగా మద్యం సేవించడం వల్ల కాలేయ వ్యాధులు, గుండె సమస్యలు, వేగంగా వృద్ధాప్యం రావడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఈ ఆరోగ్య సమస్యలను తమ పిల్లలకు వారసత్వంగా అందిస్తారు. గర్భస్థ పిండాలకు ఈ రోగాలు సంక్రమించడం వల్ల టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు త్వరగా వస్తాయి. ఈ మేరకు ఇదివరకే పలు అధ్యయనాల్లో తేలింది.