Earth's Inner Core Rotation Slowed: రోజు నిడివి మారుతున్నదా? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? నెమ్మదించిన భూమి అంతర్భాగ భ్రమణంతో ఇదే చర్చ తెరమీదకు.. అసలేం జరిగిందంటే??
భూ అంతర్భాగ భ్రమణం నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు.
Newdelhi, June 15: భూ అంతర్భాగ భ్రమణం (Earth's Inner Core) నెమ్మదించిందా ? దీని ఫలితంగా రోజు నిడివి మారబోతున్నదా ? ప్రస్తుతం ఉన్న 24 గంటల సమయాన్ని కుదిస్తారా? ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చ నిజమయ్యే అవకాశం కూడా ఉన్నదని అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. భూమి ఉపరితలంతో పోలిస్తే అంతర్భాగం(ఇన్నర్ కోర్) భ్రమణం (Rotation) మందగించిందని వీరు ఒక అధ్యయనంలో తేల్చారు. ఇనుము, నికెల్ తో కూడి భూమి ఇన్నర్ కోర్ భ్రమణం చాలా దశాబ్దాల తర్వాత 2010 నుంచి మందగించిందని తెలిపారు. ఫలితంగా రోజు నిడివిలో కొంత సమయం కుదించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఐతే, ఇప్పటికిప్పుడు దానిపై నిర్ణయం ఉండకపోవచ్చని తెలిపారు.
కారణం ఏంటంటే?
గ్రీన్ లాండ్, అంటార్కిటికాలో మంచు వేగంగా కరుగుతుండటం వల్ల భూభ్రమణం నెమ్మదించిందని, ఇది సమయంపై ప్రభావం చూపబోతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.