Microplastics in Human Semen: పురుషుడి వృషణాల్లోనే కాదు.. వీర్యంలోనూ మైక్రో ప్లాస్టిక్ గుర్తింపు.. శుక్ర కణాల కదలికలను అడ్డుకొంటున్న ప్లాస్టిక్.. పురుష సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం.. పరిశోధించిన అన్ని శాంపిల్స్ లోనూ పాజిటివ్.. చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి.
Newdelhi, June 17: మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు వెరసి మనిషి ఆరోగ్యంపై పలు విధాలుగా దుష్ప్రభావం చూపుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రోప్లాస్టిక్ (Microplastics) రక్కసి శరీరంలోని అన్ని అవయవాలకు పాకుతున్నది. మొన్నటికి మొన్న రక్తం (Blood), గుండె (Heart), కిడ్నీ (Kidney), గర్భిణుల మావి (పిండం)తో పాటు పురుషుడి వృషణాల్లోనూ గుర్తించిన మైక్రోప్లాస్టిక్.. తాజాగా వీర్యకణాల్లోనూ వెలుగుచూసింది. ఈ మేరకు చైనా పరిశోధకులు వెల్లడించారు.చైనాకు చెందిన ఆరోగ్యవంతులైన 36 మంది యువకుల శుక్రకణాలను ప్రయోగశాలలో విశ్లేషించగా, అన్ని నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్టు బయటపడింది.
శుక్ర కణాల కదలికలపై ప్రభావం
సంతానోత్పత్తికి కీలకమైన శుక్ర కణాల కదలికలను ఈ ప్లాస్టిక్ రేణువులు అడ్డుకొంటున్నాయని, శుక్ర కణాల ఎదుగుదల, నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని పరిశోధకులు అందోళన వ్యక్తం చేశారు.