Gaganyaan Postponed: గగన్‌ యాన్‌ తొలి టెస్ట్‌ ఫ్లైట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే??

వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే కారణంగా తెలుస్తుంది.

Gaganyaan Postponed (Credits: ISRO-X)

Hyderabad, Oct 21: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) చేపట్టిన గగన్‌ యాన్‌ (Gaganyaan) టెస్ట్‌ వెహికల్‌ ప్రయోగం వాయిదా పడింది. వాతావరణం, మిషన్ లో అంతర్గత సమస్యలే కారణంగా తెలుస్తుంది. తదుపరి ప్రయోగం షెడ్యూల్ (Schedule) వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఇస్రో వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 8.30 గంటలకు గగన్‌ యాన్‌ టెస్ట్‌ వెహికల్‌ను ఇస్రో ప్రయోగించాల్సింది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ’ పనితీరును పరీక్షించనున్నారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్‌ యాన్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే.

EC Shocker: 107 మంది తెలంగాణ అభ్యర్థులపై ఈసీ వేటు.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం.. గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఖర్చు వివరాలు సమర్పించని సదరు అభ్యర్థులు.. 10ఏ కింద అనర్హత చర్యలు తీసుకున్న ఈసీ

ఏం పరీక్షిస్తారు?

ఈ మిషన్ లో తొలుత క్రూ మాడ్యూల్‌ వ్యవస్థను పరీక్షించాల్సిఉంది. అనుకోని ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు. ఇందులో భాగంగా డీ1 రాకెట్‌ ద్వారా క్రూ మాడ్యూల్‌ ని నింగిలోకి పంపనున్నారు. అయిదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్‌ చేశారు. బంగాళాఖాతంలోకి పడేలా రూపకల్పన చేశారు.

Traffic Restrictions: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు, సద్దుల బతుకమ్మ సందర్భంగా ఈ ప్రాంతంలో వాహనాల మళ్లింపు, ప్రత్యామ్నాయ మార్గాలివే!