పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మరణానికి కారణమయ్యారనే కేసులో పోలీసులు హీరో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కౌంటర్ దాఖలు చేయాలంటూ నాంపల్లి కోర్టు చిక్కడపల్లి పోలీసులకు సూచించింది.

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?

ఈ కేసులో పోలీసులు అల్లు అర్జున్ ను ఏ11 నిందితుడిగా చేర్చారు. తాజాగా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై సోమవారం కోర్టు విచారణ చేపట్టింది. పోలీసులు దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించింది. బెయిల్ కోసం అల్లు అర్జున్ న్యాయవాదులు, ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలను విన్న కోర్టు.. జనవరి 3న తీర్పు వెలువరిస్తామని చెబుతూ కేసును వాయిదా వేసింది.