Hyderabad, Dec 30: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) కు సంబంధించిన బెయిల్ పిటిషన్ (Bail Petition) పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ తో ప్రస్తుతం అల్లు అర్జున్ బయటే ఉన్నారు. గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో కోర్టులో ఇటీవలే అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. ఆ విచారణలో కౌంటర్ కి పోలీసులు సమయం కోరారు. ఈ క్రమంలో కేసు విచారణ నేటికి వాయిదా పడింది. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ
బెయిల్ పిటిషన్‌పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం
గత విచారణలో కౌంటర్‌కి సమయం కోరిన పోలీసులు
హైకోర్టు మధ్యంతర బెయిల్‌తో బయట ఉన్న అల్లు అర్జున్
గతంలో 14 రోజుల రిమాండ్ ముగియడంతో వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్… pic.twitter.com/dujDkFDXeK
— BIG TV Breaking News (@bigtvtelugu) December 30, 2024
బన్నీ వస్తారా?
గత విచారణకు అల్లు అర్జున్ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. అయితే, నేటి విచారణకు ఆయన హాజరు అవుతారా? లేదా ఆయన లాయర్లు మాత్రమే హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉంది.