Lunar Eclipse 2022: చంద్రగ్రహణం..ఈ నాలుగు రాశులు వారికి ఈ ఏడాది తిరుగే ఉండదు, వ్యాపార,ఉద్యోగ, ఆదాయ మార్గాల్లో అంతా బంగారమే, బ్లడ్ మూన్‌పై ప్రత్యేక కథనం

చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది.

May's Super Flower Blood Moon (Photo Credits: File Image)

ఈ ఏడాది తొలి సంపూర్ణ చంద్రగ్రహణం (Lunar Eclipse 2022) మే16 తేదీ ఏర్పడనుంది. చంద్రగ్రహణం మూడు రకాలు - సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం మరియు పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమికి కొంచెం వెనుకగా తన నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం (Lunar Eclipse) ఏర్పడుతుంది. ఈ గ్రహణం మొత్తం దశ యొక్క వ్యవధి 1 గంట 25 నిమిషాలు మరియు పాక్షిక దశ రెండు గంటల కంటే ఎక్కువ ఉంటుంది.

స్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం మే 16 రాత్రి 10.27 గంటలకే ప్రారంభమై అర్ధరాత్రి దాటాక 12.53 గంటల వరకు ఉండనుంది. మన కాలమానం ప్రకారం రేపు ఉదయం 7.57 గంటల నుంచి10.15 గంటల వరకు ఉండనుంది. చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్లిపోయే ముందు ఎర్రటి రంగులోకి మారిపోతాడని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఖగోళ సంఘటనను నాసా (NASA) ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మే 16 తేదీన ఏర్పడే ఈ గ్రహణాన్ని సూపర్ ఫ్లవర్ బ్లడ్ మూన్ అని కూడా అంటారు.

కాగా, మన దేశంలో గ్రహణం చూసే అవకాశం లేదు. దక్షిణ అమెరికా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మాత్రమే రుధిర చంద్రుడు దర్శనమిస్తాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోమ్, బ్రసెల్స్, లండన్, ప్యారిస్, హవానా, జొహెన్నస్ బర్గ్, లాగోస్, మాడ్రిడ్, సాంటియాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, గ్వాటెమాలా సిటీ, రియో డి జనేరో, షికాగోల్లో సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. అంకారా, కైరో, హొనొలులు, బూడాపెస్ట్, ఏథెన్స్ లలో పాక్షిక గ్రహణమే దర్శనమివ్వనుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం (Blood moon) యొక్క మొత్తం దశ ఉత్తర మరియు దక్షిణ అమెరికా అంతటా, ఐరోపా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల నుండి కనిపిస్తుంది. దక్షిణ/పశ్చిమ యూరప్, దక్షిణ/పశ్చిమ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రం మరియు అంటార్కిటికాలోని చాలా ప్రాంతాలు గ్రహణం యొక్క కొన్ని భాగాలను చూస్తాయి.

సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు మాత్రం చెల్లాచెదురవుతాయని, ఎరుపు, నారింజ రంగులు మాత్రం కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని పేర్కొన్నారు. గ్రహణం సమయంలో చంద్రుడు కొద్దిసేపు మాయమైపోతాడని చెప్పారు. అయితే, చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి కళ్లద్దాలు అవసరం లేదని, రక్షణపరికరాల్లేకుండానే చూడవచ్చని అంతరిక్ష శాస్త్రవేత్తలు చెప్పారు. కాగా, గ్రహణం పతాక స్థాయికి చేరినప్పుడు చంద్రుడు 3,62,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడని సైంటిస్టులు చెబుతున్నారు.

మన దేశంలో గ్రహణం పట్టట్లేదు కాబట్టి చూడలేమన్న నిరాశ అయితే వద్దు. ఎందుకంటే నాసాలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ గ్రహణాన్ని చూడాలనుకుంటే నాసా వెబ్ సైట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడవచ్చు. కాగా, ఈ ఏడాది మొత్తంగా రెండు చంద్రగ్రహణాలు దర్శనమివ్వనున్నాయి. ఇవాళ్టిది మొదటిది కాగా.. రెండో గ్రహణం నవంబర్ 8న కనువిందు చేయనుంది.

ఏ రాశులవారికి అదృష్టం

ఈ ఏడాది అంటే 2022లో తొలి చంద్ర గ్రహణం మేషరాశి జాతకులపై అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా వృద్ధి ఉంటుంది. వారి వర్క్‌ప్లేస్‌పై ప్రభావం పడుతుంది. కొత్త ఆఫర్లు రావడం, ఆదాయం పెరగడం ఖాయం. కుటుంబసభ్యులతో సంబంధాలు బాగుంటాయి. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి.వారు తమ వ్యాపారం మరియు రంగంలో పురోగతిని ఆశించారు. ఉద్యోగార్ధులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సౌకర్యాలు పెరుగుతాయి.

వృషభరాశి వారికి ఈ ఏడాది చంద్ర గ్రహణ ప్రభావంతో అంతా శుభం కలుగుతుంది. ఈ రాశివారి కెరీర్‌లో కలిగే మార్పు భవిష్యత్‌కు చాలా మంచిది. ఆదాయం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రజాదరణ పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి.

చంద్ర గ్రహణం, ఈ 5 రాశుల వారికి రేపటి నుంచి అంతా శుభం, పట్టిందల్లా బంగారమే, ధన యోగం, వివాహం, వాహనం దక్కుతాయి

సింహరాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం సానుకూలంగా ఉంటుంది. సంపూర్ణ చంద్రగ్రహణం సింహరాశివారి కెరీర్‌పై వెన్నెల కురిపిస్తుంది. పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కష్టపడి పనిచేస్తే కచ్చితంగా ఫలితాలుంటాయి. మాటతీరు మెరుగుపర్చుకుంటే ఇక తిరుగుండదంటున్నారు పండితులు.

ధనస్సురాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం పాజిటివ్‌గా ఉంటుంది. ఈ రాశివారి పనుల్లో ప్రగతి కన్పిస్తుంది. ఇప్పటి వరకూ వృద్ధి కోసం నిరీక్షించినవారి కలలు నెరవేరుతాయి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవితం ఆనందమయంగా ఉంటుంది.