National Space Day: ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డేగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేసిన కేంద్ర కేబినెట్
ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు.
New Delhi, August 29: చంద్రయాన్-3 (Chandrayaan 3) చందమామ దక్షిణ ధ్రువాన్ని ముద్దాడిన ఆగస్టు 23ను కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ స్పేస్ డే’గా (National Space Day) ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరించారు. చంద్రయాన్-3 సాధించిన ఘనత పట్ల యావత్ దేశం, కేంద్ర కేబినెట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. మన దేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ చారిత్రక విజాయానికి తగిన గుర్తింపు ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం భావించింది.
ప్రజ్ఞాన్ ప్రయాణిస్తున్న దారిలో పెద్ద గొయ్యి, వెంటనే అలర్ట్ అయి రోవర్ రూట్ మార్చిన ఇస్రో
అందుకే ఆగస్టు 23ను ‘నేషనల్ స్పేస్ డే’ జరుపుకోవడానికి ఆమోదం తెలిపింది. అత్యద్భుతమైన ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను మంత్రివర్గం అభినందిస్తోందని’ ఆయన పేర్కొన్నారు. మన శాస్త్రవేత్తలు చేసిన నిరంతర ప్రయోగాల కృషి ఫలితంగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.