Nipah Virus on ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ.. ఐసీఎంఆర్ డీజీ రాజీవ్ బహల్ వెల్లడి
కోవిడ్-19 ఇన్షెక్షన్ తో పోలిస్తే నిఫా వైరస్ తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు.
Hyderabad, Sep 16: కోవిడ్-19 (Covid-19) ఇన్షెక్షన్ తో పోలిస్తే నిఫా వైరస్ (Nipah Virus) తో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి(ఐసీఎంఆర్) (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహల్ చెప్పారు. నిఫా వైరస్ కేసుల్లో మరణాల రేటు 40 శాతం నుంచి 70 శాతం దాకా ఉంటోందన్నారు. అదే కోవిడ్‌లో అయితే 2-3 శాతం మధ్యనే ఉందని వివరించారు. కేరళలో నిఫా కేసుల్లో పెరుగుదల నమోదు అవుతుండటంతో ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా నుంచి మోనోక్లోనల్ యాంటీబాడీ 20 డోసులు తెప్పించాలని కేంద్రం నిర్ణయించిందన్నారు.
ఎలా సోకుతుంది?
జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. కలుషిత ఆహారం లేక ఒకరి నుంచి మరొకరికి కూడా ఇది సోకుతుంది. నిఫా వైరస్ తో ఇప్పటికే కేరళలో ఇద్దరు చనిపోయారు. మరో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. భారత్ కాకుండా విదేశాల్లో ఇప్పటి వరకు 14 మందికి మాత్రమే ఈ వైరస్ సోకిందన్నారు.