Sunlight Prolong Life By Two Years: మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకోవాలనుకొంటున్నారా? అయితే, శరీరానికి రోజూ 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి తగిలేలా చూసుకోండి.. ఎందుకంటే?

అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని రెండేండ్లు పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి.

Sunlight Prolong Life By Two Years

Hyderabad, July 29: ఎక్కువకాలం బతుకాలని ఎవరికైనా ఉంటుంది. అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని (Life Span) రెండేండ్లు (Two Years) పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం  5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి. చాలు. ఇక మీ ఆయుష్షు రెండేండ్లు పెరిగినట్టే. అతినీల లోహిత కిరణాలు తక్కువ ఉన్న సూర్యరశ్మితో ఆరోగ్యం మెరుగవుతుందని హైదరాబాద్‌ కు చెందిన డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ ఎక్స్‌ లో వెల్లడించారు. ఒక అధ్యయనాన్ని పేర్కొంటూ, సూర్యరశ్మి తగిలే వారి జీవిత కాలం రెండేండ్లు పెరిగిందన్నారు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం

ఇంకా ఎన్నో లాభాలు

సూర్య రశ్మి తరుచూ తగిలే వారికి డయాబెటిస్‌, రక్త పోటు, గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. విటమిన్‌ డి సప్లిమెంట్స్‌, సహజ సూర్యకాంతి ద్వారా వచ్చే ప్రయోజనాలు ఒకటి కావని ఈ అధ్యయనం గుర్తు చేసింది.

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు స్పాట్ డెడ్, బైక్‌పై వెళ్తున్న వారిని ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం, పోలీసుల దర్యాప్తు



సంబంధిత వార్తలు