Selling Sunlight: రాత్రివేళ సూర్యకాంతి ఉత్పత్తి.. దాన్ని విక్రయిస్తారట కూడా.. అమెరికాలోని కాలిఫోర్నియా కంపెనీ ప్రకటన.. ఎందుకట??

రాత్రివేళ సూర్యకాంతిని ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది.

Earth (Credits: X)

Newyork, Aug 30: అమెరికాలోని (America) కాలిఫోర్నియాకు చెందిన రిఫ్లెక్ట్‌ ఆర్బిటల్‌ అనే కంపెనీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. రాత్రివేళ సూర్యకాంతిని (Sun Light) ఉత్పత్తి చేయడమే కాదు.. దాన్ని విక్రయిస్తామని ఈ కంపెనీ చెప్తున్నది. ఇప్పటికే ఈ దిశగా తమ ప్రణాళికలను సిద్ధం చేసినట్టు ఆ సంస్థ సీఈఓ బెన్‌ నోవాక్‌ వెల్లడించారు. సహజంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా జరిగే సౌర విద్యుత్తు ఉత్పత్తి సూర్యకాంతి ఉన్నప్పుడే అవుతుంది. కానీ, పగటిపూట  సమయంలో విద్యుత్తు అవసరం తక్కువ. అయితే, విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే రాత్రివేళ సౌర విద్యుత్తు ఉత్పత్తి  కావడం లేదని నోవాక్ తెలిపారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి రాత్రిపూట కూడా సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే సాంకేతికతను తాము అభివృద్ధి చేశామని, అలా ఉత్పత్తి చేసిన సూర్య కాంతిని విక్రయిస్తామని నోవాక్‌ చెప్తున్నారు.

ఈ శునకం గారు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది.. దీని ఆస్తుల విలువ రూ.3,300 కోట్లు మరి.. ఏంటా విషయం?

ఎలా ఉత్పత్తి చేస్తారు?

రాత్రివేళ సౌర విద్యుత్తు ఉత్పత్తి  చేయడానికి  గానూ 57 చిన్న ఉపగ్రహాలను భూమి నుంచి 370 మైళ్ల ఎత్తుకు పంపించనున్నట్టు నోవాక్ చెప్పారు. ఈ ఉపగ్రహాలకు ఒక్కోదానికి 33 చదరపు అడుగుల మైలార్‌ అద్దాలు ఉంటాయి. నింగిలో ఈ అద్దాలపై పడే సూర్యకాంతి భూమిపై ఉండే నిర్దేశిత సౌర ఫలకాలపై (రాత్రిళ్లు) ప్రతిబింబించేలా చేస్తామని, తద్వారా సూర్యాస్తమయం తర్వాత సైతం విద్యుత్తు ఉత్పత్తికి అవకాశం ఉంటుందని నోవాక్‌ తెలిపారు.

రానున్న పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు ప్రకటన.. ఏ మార్గాల్లో అంటే??

ఇప్పటికే ప్రయోగాలు

హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ ద్వారా తమ ఆలోచనను ఇప్పటికే ప్రయోగించి చూపించామని, ఆ ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చినట్టు నోవాక్ ఒక ప్రకటనలో తెలిపారు.