Newdelhi, Aug 30: కింది ఫొటోలో కనిపిస్తున్న జర్మన్ షెఫర్డ్ శునకం పేరు గుంథెర్-6 (Gunther VI). ఇది అలాంటి ఇలాంటి కుక్క కాదు. దీనికి ఓ విమానం, యాట్ సహా బీఎండబ్ల్యూ కారు ఉన్నాయి. ఈ శునకం గారికి సేవ చేయడానికి 27 మంది సిబ్బంది, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేయడానికి ఓ స్పెషల్ చెఫ్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కుక్కకు రూ.3వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయి. అందుకే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న శునకంగా (World’s Richest Dog) ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది.
Meet #GuntherVI: The world’s #richest #dog with a net of over Rs 3,300 crore – He owns a private jet, a yacht, and other expensive things@feleisurehttps://t.co/c8mPTbHSbQ
— Financial Express (@FinancialXpress) August 27, 2024
ఎక్కడిదీ ఇంత ఆస్తి?
కర్లోటా లీబెన్ స్టీన్ అనే శ్రీమంతుడికి ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు. అయితే, 1992లో అతను మరణించాడు. దీంతో ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి గుంథెర్-3ని అతను పెంచుకున్నాడు. అనతికాలంలోనే ఆ శునకం తన మనసుకు ఎంతో దగ్గరైంది. దీంతో కర్లోటా లీబెన్ స్టీన్ తన ఆస్తినంతటినీ ఈ కుక్క పేరు మీద రాశారు. ఈ ఆస్తుల నిర్వహణ బాధ్యతలను తన ఇటాలియన్ స్నేహితుడు మౌరిజియో మియాన్ కు అప్పగించారు. అయితే, మియాన్ ఈ ఆస్తులను విపరీతంగా పెంచాడు. దాదాపు వాటి విలువ రూ. 3,300 కోట్లకు చేరింది. దీంతో గుంథెర్-6కు కళ్లు చెదిరే స్థాయిలో ఆస్తులు చేకూరాయి.