Hyderabad, July 29: ఎక్కువకాలం బతుకాలని ఎవరికైనా ఉంటుంది. అవునా? అయితే, మీ జీవిత కాలాన్ని (Life Span) రెండేండ్లు (Two Years) పెంచుకొనే సింపుల్ చిట్కా మేం చెప్తాం. దీనికి, మందులూ, మాకులూ.. వ్యాయామం, యోగా ఇలా ఏం ప్రయాస పడాల్సిన పనికూడా లేదు. రోజూ కేవలం 5 నుంచి 30 నిమిషాలు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా చూసుకోండి. చాలు. ఇక మీ ఆయుష్షు రెండేండ్లు పెరిగినట్టే. అతినీల లోహిత కిరణాలు తక్కువ ఉన్న సూర్యరశ్మితో ఆరోగ్యం మెరుగవుతుందని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ ఎక్స్ లో వెల్లడించారు. ఒక అధ్యయనాన్ని పేర్కొంటూ, సూర్యరశ్మి తగిలే వారి జీవిత కాలం రెండేండ్లు పెరిగిందన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం
Regular sunlight exposure ranging from five to 30 minutes daily when ultraviolet (UV) rays are low can boost longevity and enhance health, an expert said on Sunday.https://t.co/3L5W41EYE0
— Sambad English (@Sambad_English) July 28, 2024
ఇంకా ఎన్నో లాభాలు
సూర్య రశ్మి తరుచూ తగిలే వారికి డయాబెటిస్, రక్త పోటు, గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. విటమిన్ డి సప్లిమెంట్స్, సహజ సూర్యకాంతి ద్వారా వచ్చే ప్రయోజనాలు ఒకటి కావని ఈ అధ్యయనం గుర్తు చేసింది.