SpaceX Starship Explodes: దూసుకెళ్లిన రెండు నిమిషాలకే పేలిపోయిన స్టార్‌షిప్, ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైందని తెలిపిన స్పేస్‌ఎక్స్
ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల వ్యోమగాములను పంపడానికి రూపొందించిన అంతరిక్ష నౌక యొక్క మొదటి పరీక్షా విమానంలో నిరాశపరిచింది.
స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్.. ఇప్పటివరకు నిర్మించిన అత్యంత శక్తివంతమైన రాకెట్, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల వ్యోమగాములను పంపడానికి రూపొందించిన అంతరిక్ష నౌక యొక్క మొదటి పరీక్షా విమానంలో నిరాశపరిచింది.
టెక్సాస్‌లోని బోకా చికాలోని ప్రైవేట్ స్పేస్‌ఎక్స్ స్పేస్‌పోర్ట్ అయిన స్టార్‌బేస్ నుండి సెంట్రల్ టైమ్ (1333 GMT) ఉదయం 8:33 గంటలకు భారీ రాకెట్ విజయవంతంగా పైకి దూసుకెళ్లింది.ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడిపోవాలి. కానీ, విఫలం కావడంతో పేలిపోయినట్లు ‘స్పేస్‌ఎక్స్’ సంస్థ పేర్కొంది. ఈ ప్రయోగ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని వెల్లడించింది.
స్టార్‌షిప్’ పొడవు ఏకంగా 120 మీటర్లు(400 అడుగులు) ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి దీన్ని టెస్ట్- ఫ్లైట్ కోసమే ప్రయోగించారు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు సాగే టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా రూపొందించారు.
స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం భూమి చుట్టు దాదాపు ఒక పరిభ్రమణం సాగించి, హవాయి సమీపంలో పడిపోయేలా తయారుచేశారు. గత సోమవారమే దీని ప్రయోగానికి అంతా సిద్ధం చేయగా.. సాంకేతిక కారణాలతో చివరి క్షణంలో వాయిదా పడింది. నేడు ప్రయోగించగా.. ఊహించని విధంగా విఫలమైంది.