Water on Earth: ఆకాశగంగ.. ఇలకు వచ్చిందిలా.. తోక చుక్కలు ఢీ కొనడం వల్లే భూమిపైకి నీరు.. తాజా అధ్యయనంలో వెల్లడి
అదేమో గానీ, ఆకాశం నుంచే నీరు భూమి మీదకు తరలి వచ్చిందని అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడించారు.
Newdelhi, July 14: భగీరథుడు ఆకాశ గంగను భూమికి (Earth) రప్పించాడని పురాణాలు చెప్తున్నాయి. అదేమో గానీ, ఆకాశం (Sky) నుంచే నీరు (Water) భూమి (Earth) మీదకు తరలి వచ్చిందని అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడించారు. వారి వాదన ప్రకారం.. అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ లో డార్క్ కామెట్స్ (ప్రత్యేకమైన తోకచుక్కలు), 60 శాతం మేర భూమిని పోలిన కొన్ని ఆస్టరాయిడ్లు తిరుగుతూ ఉంటాయి. వీటిలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు.
అలా నీరు చేరింది..
వేల ఏండ్ల కిందట ఈ డార్క్ కామెట్స్, ప్రత్యేక ఆస్టరాయిడ్లు భూమిని ఢీకొట్టినట్టు మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. కాలక్రమంలో భూమిపై అలా నీరు ఏర్పడిందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ లోని అశోక్ నగర్ చౌరస్తాలో కొనసాగుతున్న నిరుద్యోగులు మెరుపు ధర్నా (వీడియో)