ShareChat Layoffs: 500 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన షేర్‌చాట్, వెంటాడుతున్న ఆర్థిక మాంద్య భయాలే కారణం

కంపెనీలో 20% మంది ఉద్యోగులను తొలగించింది.

Layoff Representational Image (File Photo) (Photo Credits: Pixabay)

హోమ్‌గ్రోన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్‌చాట్, షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ Moj యొక్క పేరెంట్ మొహల్లా టెక్ తాజా ఉద్యోగాల కోత విధించింది. కంపెనీలో 20% మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ CEO అంకుష్ సచ్‌దేవా అంతర్గత నోట్ ప్రకారం రాబోతున్న ఆర్థిక మాంద్యం వల్ల కంపెనీలో ఉద్యోగాల కోత తప్పలేదని తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, తాజా బెంగళూరుకు చెందిన సంస్థలో దాదాపు 500 ఉద్యోగులకు కంపెనీ ఉద్వాసన పలికింది.. గతేడాది డిసెంబర్‌లో కంపెనీ కనీసం 100మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది.

ఉద్యోగుల తొలగింపు బాటలో మరో దిగ్గజ కంపెనీ, 200 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయిన ఓలా క్యాబ్

ఉద్యోగులకు రాసిన నోట్‌లో, సచ్‌దేవా మాట్లాడుతూ, "ప్రస్తుత అనిశ్చితిలో మా కంపెనీ ఆర్థిక ఆరోగ్య, దీర్ఘకాల మనుగడ కోసం ప్రతిభావంతులైన 20% FTE లతో (పూర్తి సమయం ఉద్యోగులు)ను తొలగించాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2015లో ఫరీద్ అహ్సన్, భాను ప్రతాప్ సింగ్‌లతో కలిసి సంస్థను ప్రారంభించిన సచ్‌దేవా అనతి కాలంలోనే కంపెనీని ఉన్నత స్థితికి తీసుకువచ్చారు. అయితే గత మూడేళ్లకుగా కరోనాతో దానికి ఆర్థిక మాంద్యం తప్పలేదు.

ఉద్యోగులను తీసేస్తున్న గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఆర్థిక మాంద్యంతో 40 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు

షేర్‌చాట్ మాతృ సంస్థలో బాధిత ఉద్యోగుల కోసం కంపెనీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. పరిహారంలో నోటీసు వ్యవధికి చెల్లింపుగా పూర్తి-సమయ ఉద్యోగిగా పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి నెలవారీ స్థూల జీతం అదనంగా 15 రోజులు కలిపి ఇస్తోంది.



సంబంధిత వార్తలు