Big Billion Days Sale: రూ.5,999 కేహెచ్‌డి టీవీ, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్‌ని ప్రారంభించిన థామ్సన్, టీవీల వివరాలు ఓ సారి చెక్ చేసుకోండి
అక్టోబర్ నుంచి 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ( Flipkart) జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో (Big Billion Days sale) ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. కాగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' (Big Save on Bigger TV offer) పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభమవుతుంది.
యూరప్‌కు చెందిన ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ (Thomson) అత్యంత తక్కువ ధరకే టీవీలు అందుబాటులోకి తెస్తోంది. అక్టోబర్ నుంచి 16 - 21 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో ( Flipkart) జరగనున్న బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో (Big Billion Days sale) ఈ బంపర్ ఆఫర్ కొనుగోలుదారులకు అందించనుంది. కాగా 'బిగ్ సేవ్ ఆన్ బిగ్గర్ టీవీ ఆఫర్' (Big Save on Bigger TV offer) పేరుతో దీన్ని తీసుకువచ్చింది. గత 3 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తున్న థామ్సన్ విజయవంతంగా దూసుకుపోతోంది. కాగా ఆర్9 సిరీస్ థామ్సన్ టీవీ డీల్స్ రూ .5999 నుండి ప్రారంభమవుతాయి. ఆండ్రాయిడ్ థామ్సన్ స్మార్ట్ టీవీ ధర రూ.10999 నుండి ప్రారంభమవుతుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో టీవీ ఆఫర్‌లు
ఆర్ 9 సిరీస్ కింద రెండు టీవీలు 24 హెచ్డీ బేసిక్ 5,999 రూపాయలు, 32 హెచ్డీ బేసిక్ ధర 8,499 రూపాయల వద్ద అందుబాటులో ఉంటాయి.
పాథ్ సిరీస్ థామ్సన్ మోడళ్లు
32 పాథ్ 0011 ధర - రూ. 10,999
32 పాథ్ 0011బీఎల్ ధర -రూ. 11,499
40 పాథ్ 7777 ధర - రూ. 15,999
43 పాథ్ 0009ధర - రూ. 18,999
43 పాథ్ 4545 ధర -రూ. 22,499
50 పాథ్1010 ధర -రూ. 24,499
55 పాథ్ 5050 ధర - రూ. 28,999
ఆథ్రో సిరీస్ థామ్సన్ టీవీ మోడల్స్
43 ఆథ్రో 2000 - రూ. 22,499
50 ఆథ్రో 1212 - రూ. 27,499
55 ఆథ్రో 0101 - రూ. 30,999
65 ఆథ్రో 2020 - రూ. 45,999
75ఆథ్రో 2121 -రూ. 94,499
ఈ సీజన్ లో 200,000 యూనిట్ల అమ్మకాన్ని అంచనా వేస్తున్నామని థామ్సన్ టీవీ ఇండియా బ్రాండ్ లైసెన్సీ, సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అవనీత్ సింగ్ మార్వా తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో గూగుల్ భాగస్వామ్యంతో సర్టిఫైడ్ ఆండ్రాయిడ్ టీవీలను తీసుకొచ్చిన థామ్సన్ ప్రీమియం, బడ్జెట్ ధరల్లో సెమీ, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సేల్ లో భాగంగా విద్యార్థులకు కూడా ఫ్లిప్ కార్ట్ శుభవార్త తెలిపింది. దేశంలోని టైర్ 2 సిటీల్లోని అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం పెయిడ్ ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ నెల16న ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాల్లో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ ప్రోగ్రాంను తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా ప్రకటించిన ‘లాంచ్‌ప్యాడ్’ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రాం 45 రోజులు ఉంటుంది. దీని ద్వారా విద్యార్థులు సప్లయి చెయిన్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యాన్ని పొందవచ్చు.ఈ-కామర్స్ ఇండస్ట్రీలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ప్రాసెస్‌ను, క్లిష్టమైన నైపుణ్యాలను విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.