Twitter Down: ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ డౌన్‌, వేల సంఖ్యలో ఫిర్యాదులు, ఎలాంటి ప్రకటన చేయని యాజమాన్యం, సోషల్ మీడియాలో ట్విట్టర్‌ పై మీమ్స్‌

ప్రపంచవ్యాప్తంగా కొంత సేపు ట్విట్టర్ పని చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికల మీద నెటిజన్లు ట్విట్టర్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్నారు. ట్విట్టర్ లోనూ `ట్విట్టర్ డౌన్ #Twitterdown` ట్రెండవుతున్నది. వేలాది మంది యూజర్లకు ట్విట్టర్ ఖాతాలు అందుబాటులోకి రాలేదు.

Twitter Representational Image (Photo Credits : File Photo)

New Delhi, July 01: సోషల్ మీడియా వేదిక ‘ట్విట్టర్’లో ఎర్రర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కొంత సేపు ట్విట్టర్ పని చేయలేదు. దీంతో సోషల్ మీడియా వేదికల మీద నెటిజన్లు ట్విట్టర్ యాజమాన్యంపై నిరసన తెలుపుతున్నారు. ట్విట్టర్ లోనూ `ట్విట్టర్ డౌన్ #Twitterdown` ట్రెండవుతున్నది. వేలాది మంది యూజర్లకు ట్విట్టర్ ఖాతాలు అందుబాటులోకి రాలేదు. పలువురు యూజర్లు తాము ట్వీట్ల వ్యూ చూడాలన్నా, కొత్త ట్వీట్లు పెట్టాలన్నా ‘కెనాట్ రిట్రైవ్ ట్వీట్స్ (Cannot retrive tweets)` అని మెసేజ్ వస్తున్నదని ఫిర్యాదు చేశారు. కొందరు యూజర్లు ‘రేర్ లిమిట్ ఎక్సీడెడ్ ఎర్రర్ మెసేజ్’ అని కూడా రిపోర్ట్ చేస్తున్నారు. కానీ ఈ ఎర్రర్ వచ్చిన సంగతిని ట్విట్టర్ గుర్తించడం గానీ, సమస్యకు కారణంపై గానీ ట్విట్టర్ యాజమాన్యం వివరణ ఇవ్వలేదు.

తాము సాధ్యమైనంత త్వరగా అప్ డేట్ చేస్తామని , మరింత సమాచారం కోసం వెనక్కి వెళ్లి చెక్ చేసుకోండనే సమాచారం మాత్రమే వస్తున్నది.

ఆన్ లైన్ సర్వీసుల అంతరాయంపై పని చేస్తున్న వెబ్ సైట్ ‘డౌన్ డిటెక్టర్’ ట్విట్టర్ లాగిన్‌లో 4000కి పైగా సమస్యలు తలెత్తాయని పేర్కొంది. దీనిపై వేలాది మంది యూజర్లు ట్విట్టర్ వేదికగా తమ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. కొందరు మీమ్స్ కూడా అప్ లోడ్ చేస్తున్నారు.